India Vs China: ఇండియా Vs చైనా సైన్యం.. ‘టగ్‌ ఆఫ్‌ వార్‌’లో విజయం మనదే

India Vs China Tug Of War: సూడాన్‌లో భారత్‌, చైనా సైనికుల మధ్య జరిగిన టగ్‌ ఆఫ్‌ వార్‌లో మనవాళ్లు విజయం సాధించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

Updated : 29 May 2024 09:43 IST

India Vs China Tug Of War | ఖార్టూమ్: భారత సైన్యం మరోసారి తమ శక్తిని చాటింది. పట్టుదలతో కలిసికట్టుగా ఏదైనా సాధించగలమని నిరూపించింది. బృందస్ఫూర్తిని, పోటీతత్వాన్ని ప్రదర్శించింది. సూడాన్‌లో చైనా సైనికులతో ఇటీవల జరిగిన ‘టగ్‌ ఆఫ్‌ వార్‌’లో (India Vs China Tug Of War) భారత జవాన్లు విజయం సాధించారు.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది నిజమేనని భారత సైనిక వర్గాలు సైతం ధ్రువీకరించాయి. ‘ఐక్యరాజ్య సమితి పీస్‌కీపింగ్‌ మిషన్‌’లో భాగంగా భారత్‌కు చెందిన కొంత మంది సైనికులు సూడాన్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న చైనా సైనికులతో స్నేహపూర్వకంగా ‘టగ్‌ ఆఫ్‌ వార్‌’ ఆటను నిర్వహించగా మనవాళ్లు విజయం సాధించి తమ పోరాట పటిమను చాటారు.

2005 మార్చిలో ఐరాస భద్రతా మండలి ‘యునైటెడ్‌ నేషన్స్‌ మిషన్‌ ఇన్‌ సూడాన్‌ (UNMIS)’ను నెలకొల్పింది. సూడాన్‌ ప్రభుత్వం, ‘సూడాన్‌ పీపుల్స్‌ లిబరేషన్ మూవ్‌మెంట్‌’ మధ్య కుదిరిన సమగ్ర శాంతి ఒప్పందంలో భాగంగా దీన్ని ఏర్పాటు చేశారు. దీంట్లో భాగంగా అక్కడ మోహరించిన దళాలు మానవతా సహాయ కార్యక్రమాలు, మానవ హక్కుల పరిరక్షణ, ఆఫ్రికన్‌ యూనియన్‌ కార్యకలాపాలకు మద్దతుతో పాటు సామాన్యుల భద్రత కోసం పనిచేయాల్సి ఉంటుంది.

రాధికా సేన్‌కు ఐరాస అవార్డు

భారత్‌, చైనా సైనికుల మధ్య 2020లో సరిహద్దుల్లో గల్వాన్‌ లోయలో తీవ్ర ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఈ పోరులో చైనా సైనికుల దుందుడుకు చర్యలకు భారత దళాలు గట్టిగా బదులిచ్చాయి. అటువైపు పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభవించినప్పటికీ.. చైనా ప్రభుత్వం మాత్రం అధికారికంగా అంగీకరించలేదు. ఈ ఘర్షణల్లో వీరోచితంగా పోరాడిన భారత దళాల్లో 20 మంది సైనికులు అమరులయ్యారు. వీరిలో తెలంగాణకు చెందిన కర్నల్‌ సంతోష్‌ బాబు కూడా ఉన్నారు. ఈ ఘటన తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని