Murder: కెనడాలో భారతీయుడి హత్య

కెనడాలోని బ్రిటిష్‌ కొలంబియా ప్రావిన్స్‌లో భారత సంతతి వ్యక్తి యువరాజ్‌ గోయల్‌ (28) హత్యకు గురయ్యారు. కొందరు దుండగులు ఆయనపై కాల్పులు జరపడంతో ప్రాణాలు కోల్పోయారు.

Published : 11 Jun 2024 05:39 IST

ఒట్టావా: కెనడాలోని బ్రిటిష్‌ కొలంబియా ప్రావిన్స్‌లో భారత సంతతి వ్యక్తి యువరాజ్‌ గోయల్‌ (28) హత్యకు గురయ్యారు. కొందరు దుండగులు ఆయనపై కాల్పులు జరపడంతో ప్రాణాలు కోల్పోయారు. జూన్‌ 7న ఈ ఘటన జరిగినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. యువరాజ్‌ది పంజాబ్‌లోని లుథియానా. ఉన్నత చదువుల నిమిత్తం 2019లో ఆయన కెనడా వెళ్లారు. ప్రస్తుతం సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా ఉద్యోగం చేస్తున్నారు. ఇటీవల కెనడాలో శాశ్వత నివాస హోదా లభించింది. ఈ క్రమంలోనే శుక్రవారం బ్రిటిష్‌ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో కాల్పులు జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. వారు అక్కడికి చేరుకొని యువరాజ్‌ మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి సర్రేకు చెందిన మన్వీర్‌ బస్రం (23), సాహిబ్‌ బస్రా (20), హర్‌కిరట్‌ ఝుట్టీ, ఒట్టారియోకి చెందిన కీలన్‌ ఫ్రాంకోయిస్‌(20)లను అరెస్టుచేశారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని