Indian Railways: వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!

వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్‌లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది.

Published : 20 Apr 2024 00:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని భారీగా ప్రత్యేక రైళ్లు నడిపేందుకు రైల్వేశాఖ (Railway Ministry) సిద్ధమైంది. ఈ సీజన్‌లో దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్‌లలో రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు (Summer Train Trips) నడపనున్నట్లు ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 43 శాతం అధికమని ఓ ప్రకటనలో పేర్కొంది. ‘‘గత ఏడాది వేసవిలో మొత్తం 6,369 అదనపు ట్రిప్పులు నడిపాం. ఈసారి ఆ సంఖ్యను 9111కు పెంచాం. వీలైనంత ఎక్కువ మంది ప్రయాణికులు తాము కోరుకున్న గమ్యస్థానాలకు సులభంగా చేరుకునేలా అవసరమైన చర్యలు తీసుకునే విషయంలో రైల్వేశాఖ నిబద్ధతకు ఇది నిదర్శనం’’ అని పేర్కొంది. 

కౌంటర్‌కు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. UTS యాప్‌తో బుకింగ్ ఎలా..?

అత్యధికంగా పశ్చిమ రైల్వే నుంచి 1878 ట్రిప్పులు ఉన్నాయి. వాయువ్య రైల్వే (1623), దక్షిణ మధ్య రైల్వే (1012), తూర్పు మధ్య రైల్వే (1003) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మీడియా కథనాలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, రైల్వే ఇంటిగ్రేటెడ్ హెల్ప్‌లైన్ నంబర్ ‘139’, ప్యాసింజర్‌ రిజర్వేషన్‌ సిస్టమ్‌ వంటి వేదికల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా డిమాండ్‌ను అంచనా వేసినట్లు రైల్వేశాఖ తెలిపింది. ఈ సంఖ్య స్థిరంగా ఉండదని.. డిమాండ్‌కు అనుగుణంగా మరిన్ని రైళ్లు, ట్రిప్పులను పెంచుతామని వెల్లడించింది. ప్రయాణికుల భద్రత, తాగునీటి లభ్యత, రద్దీ నియంత్రణ చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. రైల్వే శాఖ నోటిఫై చేసిన ట్రిప్పుల వివరాలివే..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని