Rajnath Singh: దేశ సరిహద్దులు పూర్తిగా సురక్షితమే: రాజ్‌నాథ్‌ సింగ్‌

పొరుగు దేశాలతో భారత సరిహద్దులు పూర్తి సురక్షితంగా ఉన్నాయని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పారు.

Published : 17 Apr 2024 22:10 IST

కాసర్‌గోడ్‌: చైనా, పాకిస్థాన్‌తో సహా పొరుగు దేశాలతో భారత్ సరిహద్దులు పూర్తిగా సురక్షితంగా ఉన్నాయని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వెల్లడించారు. బుధవారం ఆయన కేరళలోని కాసర్‌గోడ్‌లో భాజపా అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. భారత భూభాగంలోకి చైనా చొచ్చుకొస్తుంటే మోదీ సర్కారు నిద్రపోయిందంటూ కాంగ్రెస్‌ ఆరోపణలు చేస్తోన్న వేళ ఆయన స్పందించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ మాట్లాడుతూ.. ‘కేంద్ర రక్షణ మంత్రిగా మీకో విషయం చెప్పాలనుకుంటున్నా.. పాకిస్థాన్‌, చైనా, భూటాన్‌, నేపాల్‌, మయన్మార్‌.. ఇలా పొరుగు దేశాలతో ఉన్న మన సరిహద్దులన్నీ పూర్తి సురక్షితంగా ఉన్నాయి’’ అని స్పష్టం చేశారు. మరోవైపు, దాదాపు 2వేల చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని, లద్దాఖ్‌లోని 65 పెట్రోలింగ్ పాయింట్లకు గాను 26 పాయింట్లను ఆక్రమించడంతో పాటు అరుణాచల్‌ప్రదేశ్‌లోని మన భూభాగంలోకి చొరబడి చైనా గ్రామాలను నిర్మించిందంటూ కాంగ్రెస్‌ చేస్తోన్న ఆరోపణల్ని రక్షణమంత్రి తోసిపుచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని