Meftal: ఈ పెయిన్‌ కిల్లర్‌తో జాగ్రత్త : అడ్వైజరీ జారీ చేసిన కేంద్రం!

నొప్పి నివారకు ఉపయోగించే మెఫ్తాల్‌ (Meftal) ఔషధం ప్రతికూల ప్రభావాలను పర్యవేక్షించాలని ఆరోగ్యరంగ నిపుణులు, రోగులకు సూచిస్తూ కేంద్ర ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది.

Published : 07 Dec 2023 19:45 IST

దిల్లీ: ఓ పెయిన్‌ కిల్లర్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం డ్రగ్‌ సేఫ్టీ అలెర్ట్‌ను జారీ చేసింది. నొప్పి నివారణకు ఉపయోగించే మెఫ్తాల్‌ (Meftal) ఔషధం ప్రతికూల ప్రభావాలను పర్యవేక్షించాలని ఆరోగ్యరంగ నిపుణులు, రోగులకు సూచించింది. ఇందుకు సంబంధించి కేంద్ర ఆరోగ్యశాఖ పరిధిలోని భారత ఔషధ ప్రమాణాలను నిర్దేశించే కమిషన్‌ (IPC) తాజా అడ్వైజరీ జారీ చేసింది.

సహజీవనం ‘ప్రమాదకరమైన జబ్బు’.. లోక్‌సభలో భాజపా ఎంపీ

‘ఫార్మకోవిజిలెన్స్‌ ప్రోగ్రాం ఆఫ్‌ ఇండియా (PvPI) డేటాబేస్‌ ప్రాథమిక విశ్లేషణలో ఈ మందు వాడితే ఇసినోఫిలియా, సిస్టెమిక్‌ సింప్టమ్స్‌ సిండ్రోమ్‌ (DRESS) వంటి ప్రతిచర్యలు వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో పైన పేర్కొన్న ఔషధ ప్రతికూల ప్రభావాల సంభావ్యతకు సంబంధించి ఆరోగ్యరంగ నిపుణులు, రోగులు నిశితంగా పర్యవేక్షించాలని సూచిస్తున్నాం’ అని పేర్కొంటూ నవంబర్‌ 30న జారీ చేసిన అడ్వైజరీలో ఐపీసీ పేర్కొంది. ఒకవేళ ఏమైనా దుష్ర్పభావాలు ఎదురైతే పీవీపీఐకి తెలియజేయాలని సూచించింది. www.ipc.gov.in వెబ్‌సైట్‌ లేదా పీవీపీఐ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1800-180-3024 ద్వారా తమను సంప్రదించాలని తెలిపింది.

సాధారణంగా రుమటాయిడ్‌ ఆర్థ్రయిటిస్‌, ఆస్టియో ఆర్థ్రయిటిస్‌, మహిళల్లో నెలసరి సమయంలో కనిపించే డిస్‌మెనోరియా, రక్తస్రావం, జ్వరం, దంతాల నొప్పి వంటి చికిత్సలో మెఫేనమిక్‌ యాసిడ్‌ పెయిన్‌ కిల్లర్‌ను సూచిస్తుంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని