S Jaishankar: ‘నేను మీ ఇంటి పేరు మారిస్తే.. అది నాదవుతుందా..?’: చైనాకు జై శంకర్ కౌంటర్

అరుణాచల్ ప్రదేశ్‌ (Arunachal Pradesh)లోని పలు ప్రాంతాలకు చైనా (China) కొత్త పేర్లు పెట్టడాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ చర్యలతో మనపై ఎలాంటి ప్రభావం ఉండదని కొట్టిపారేసింది.

Updated : 02 Apr 2024 10:32 IST

దిల్లీ: చైనా (China) కవ్వింపు చర్యలను భారత విదేశాంగమంత్రి ఎస్‌ జైశంకర్ (S Jaishankar) తీవ్రంగా ఖండించారు. వాస్తవాధీన రేఖ వెంబడి సరిహద్దు వివాదం కొనసాగుతున్న వేళ.. మరోసారి అరుణాచల్‌ ప్రదేశ్‌ (Arunachal Pradesh)లోని కొన్ని ప్రాంతాలకు డ్రాగన్‌ కొత్తగా పేర్లు పెట్టింది. నామకరణాలు చేసినంత మాత్రాన వాస్తవాలు మారవని మంత్రి గట్టిగా బదులిచ్చారు.

గుజరాత్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో చైనా పెట్టిన కొత్త పేర్లపై జై శంకర్‌కు ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన సమాధానమిస్తూ.. ‘‘నేనొచ్చి మీ ఇంటి పేరు మారిస్తే.. ఆ ఇల్లు నాదవుతుందా..? అరుణాచల్‌ ప్రదేశ్‌ ఎల్లప్పుడూ భారత్‌లో అంతర్భాగమే. పేర్లు మార్చడం వంటి చర్యలతో ఎలాంటి ప్రభావం ఉండదు. వాస్తవాధీన రేఖ వద్ద మన సైన్యం ఉంది’’ అని స్పష్టం చేశారు.

సిరియాలోని ఇరాన్‌ ఎంబసీపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడి.. పలువురు మృతి

భారత్‌లో అంతర్భాగమైన అరుణాచల్‌ ప్రదేశ్‌ తమదంటూ చైనా వితండవాదం కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే ఆ రాష్ట్రంలోని 30 ప్రాంతాలకు తాజాగా కొత్త పేర్లను పెట్టినట్లు తెలుస్తోంది. వీటిల్లో 11 నివాస ప్రాంతాలు, 12 పర్వతాలు, నాలుగు నదులు, ఒక సరస్సు, ఒక పర్వత మార్గం, కొంత భూభాగం ఉన్నాయని ‘గ్లోబల్‌ టైమ్స్‌’ కథనం పేర్కొంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని