S Jaishankar: రష్యా సైన్యంలో భారతీయులు.. స్పందించిన జై శంకర్‌

రష్యా-ఉక్రెయిన్ (Russia-Ukraine) యుద్ధంలో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి రప్పించే అంశంపై కేంద్రమంత్రి జై శంకర్ స్పందించారు. 

Published : 01 Apr 2024 13:19 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రష్యా (Russia)కు వెళ్లిన కొందరు భారతీయులు (Indians) ఊహించని విధంగా అక్కడి ఆర్మీ వద్ద చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. ఉద్యోగాల పేరిట మోసపోయిన వారు ఉక్రెయిన్ యుద్ధంలో బలవంతంగా పాల్గొనాల్సి వచ్చింది. వారిని విడిపించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో విదేశాంగ మంత్రి జై శంకర్ స్పందించారు. ‘ఈ విషయాన్ని రష్యా దృష్టికి తీసుకెళ్లాం. వారిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి’ అని వెల్లడించారు. సైన్యంలో చిక్కుకుపోయిన వారు తమను విడిపించాలంటూ వరుస వీడియోలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. హెల్పర్లుగా పనిచేయాలని తొలుత తమకు చెప్పారని, ఆ తర్వాత సాయుధ శిక్షణలో పేరు నమోదు చేశారని వెల్లడించారు.  

ఎన్నికలముందు ‘కచ్చతీవు’ రగడ.. జై శంకర్ ఏమన్నారంటే..?

పన్నూ కేసు దర్యాప్తులో దేశ భద్రతా ప్రయోజనాలు..

ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత ‘సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌’ నేత గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ (Gurpatwant Singh Pannun) హత్యకు తమ దేశంలో కుట్ర జరిగిందంటూ అమెరికా (USA) ఆరోపించిన విషయం తెలిసిందే. ఓ భారత అధికారితో కలిసి నిఖిల్‌ గుప్తా అనే వ్యక్తి ఈ కుట్ర పన్నినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెట్టి స్పందిస్తూ.. దీనిని ఆమోదించలేని రెడ్‌లైన్ అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై జై శంకర్ మాట్లాడారు. ‘ఈ అంశంలో భారత దేశ భద్రతా ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయని విశ్వసించినందున.. మేం దర్యాప్తు చేస్తున్నాం’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని