Nishikant Dubey: ‘సీఎంజీ జాగ్రత్త.. కల్పనా సోరెన్‌ వచ్చేశారు’: భాజపా ఎంపీ హెచ్చరిక

ఝార్ఖండ్‌లోని గాండేయ్‌ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కల్పనా సోరెన్‌ విజయం సాధించడంపై భాజపా ఎంపీ నిషికాంత్‌ దూబె స్పందించారు. ఈ నేపథ్యంలోనే సీఎం చంపాయీ సోరెన్‌కు హెచ్చరిక చేశారు.

Updated : 09 Jun 2024 19:10 IST

రాంచీ: ఝార్ఖండ్‌ (Jharkhand) మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ సతీమణి కల్పనా సోరెన్‌ (Kalpana Soren) ఉప ఎన్నికలో విజయం సాధించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన భాజపా (BJP) ఎంపీ నిషికాంత్‌ దూబె (Nishikant Dubey).. ప్రస్తుత సీఎం చంపాయీ సోరెన్‌ను హెచ్చరించారు. అధికారంలోని జేఎంఎం పార్టీలో మరికొన్ని రోజుల్లో అంతర్గత కలహాలు మొదలవుతాయని పరోక్షంగా జోస్యం చెప్పారు.

‘‘చంపాయీజీ.. జాగ్రత్తగా ఉండండి. కల్పనా సోరెన్‌ వచ్చేశారు. రానున్న 7 రోజులు రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో ముఖ్యమైనవి’’ అని ఉప ఎన్నికలో కల్పనా విజయాన్ని ఉద్దేశిస్తూ దూబె ‘ఎక్స్‌’ (ట్విటర్‌) వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు. జేఎంఎం ఎమ్మెల్యే సర్ఫరాజ్‌ అహ్మద్‌ రాజీనామా చేయడంతో గాండేయ్‌ అసెంబ్లీ స్థానానికి ఇటీవల జరిగిన ఉప ఎన్నికలో కల్పనా విజయం సాధించారు. భాజపా అభ్యర్థి దిలీప్‌ కుమార్‌ వర్మపై 27 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఆమె గెలుపొందిన సంగతి తెలిసిందే.

హ్యాట్రిక్‌ విజయాల మోదీ.. మూడోసారి ప్రధానిగా ప్రమాణానికి రెడీ

కాగా.. మనీలాండరింగ్‌ కేసులో ఈ ఏడాది జనవరిలో మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ అరెస్టు కావడం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఆయన రాజీనామా చేయడంతో పాలన బాధ్యతలు కల్పనాకే దక్కుతాయని అంతా ఊహించారు. కానీ, పార్టీ సీనియర్‌ నేత చంపాయీ సోరెన్‌ సీఎం పీఠమెక్కారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని