Kangana Ranaut: ‘సోనియా గాంధీ ఆకాంక్షలకు రాహుల్ బాధితుడు’: కంగనా రనౌత్ ఘాటు వ్యాఖ్యలు

రాజకీయాల్లో కొనసాగేలా రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వారి తల్లి నుంచి ఒత్తిడి ఎదుర్కొంటున్నారని నటి కంగన (Kangana Ranaut) వ్యాఖ్యానించారు. 

Updated : 04 Apr 2024 14:46 IST

దిల్లీ: కాంగ్రెస్ (Congress) నేతలు సోనియాగాంధీ (Sonia Gandhi), రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)ని ఉద్దేశించి.. నటి, మండి నియోజకవర్గ భాజపా అభ్యర్థి కంగనా రనౌత్ (Kangana Ranaut) ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన తల్లి ఆకాంక్షలకు రాహుల్‌ బాధితుడయ్యారని అన్నారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈవిధంగా స్పందించారు. 

‘3 ఇడియట్స్ సినిమాలో చూసినట్టు.. కుటుంబసభ్యుల వల్ల పిల్లలు ఇబ్బందిపడుతుంటారు. రాహుల్‌ది కూడా ఇదే పరిస్థితి. ఒత్తిడి లేకుండా వారి ఇష్టాలకు తగ్గట్టుగా సొంతంగా జీవించేందుకు రాహుల్, ప్రియాంకకు స్వేచ్ఛ ఉండాలి. ఆయన నటనలో ప్రయత్నించి ఉంటే.. మంచి నటుడు అయ్యుండేవారు’’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రాహుల్‌ వయసు 50 సంవత్సరాలు దాటినప్పటికీ.. ప్రతిసారీ యువ నేతగా రీలాంచ్ అవుతుంటారన్నారు. ఆయన ఒత్తిడికి గురవుతున్నారని, ఒంటరితనంతో బాధ పడుతున్నారని తాను భావిస్తున్నట్లు చెప్పారు.

సొంతవాళ్లే ఓటెయ్యలేదు.. ఒక్క ఓటుతో ఓడిపోయారు..!

ఓవైపు సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు నటి కంగనా రనౌత్‌ (Kangana Ranaut). హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ అభ్యర్థిగా భాజపా తరఫున ఆమె పోటీ చేయనున్నారు. ప్రధాని మోదీ పాలనపై తరచూ ప్రశంసలు కురిపిస్తుంటారు. తమ గురించి నిరంతరం ఆలోచించే నాయకుడొకరు మోదీ రూపంలో తొలిసారి దొరికినట్లు ప్రస్తుతం మహిళలు భావిస్తున్నారని ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని