Siddaramaiah: కెరీర్‌పై కుమారుడి సంచలన వ్యాఖ్యలు.. సీఎం సిద్ధూ ఏమన్నారంటే..?

Eenadu icon
By National News Team Published : 25 Oct 2025 13:21 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: కర్ణాటకలో సీఎం మార్పు అంశంపై రాజకీయ వేడి కొనసాగుతోన్న వేళ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన మాటలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో కలవరం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సిద్ధూ (Karnataka CM Siddaramaiah) స్పందించారు.

‘‘యతీంద్ర ప్రకటనను వక్రీకరించారు. ఇక దానిపై నేను చెప్పడానికి ఏముంటుంది..? నేను నా కుమారుడితో మాట్లాడాను. అసలు ఏం చెప్పాలనుకున్నావని అడిగాను. తన సిద్ధాంతాల గురించి మాత్రమే చెప్పాలని అనుకున్నట్లు యతీంద్ర చెప్పాడు. ఫలానా వ్యక్తి సీఎం కావాలని అతడు అనలేదు’’ అని సిద్ధరామయ్య సమాధానం ఇచ్చారు. బెళగావి జిల్లాలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో యతీంద్ర సిద్ధరామయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘రాజకీయాల్లో మా నాన్న చివరి దశలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బలమైన, ప్రగతిశీల భావజాలం ఉన్న నాయకుడు ఆయనకు కావాలి. అలాంటి నాయకుడికి సిద్ధరామయ్య మార్గదర్శిగా ఉంటారు కూడా. సతీశ్ ఝర్కిహోళికి ఆ లక్షణాలు ఉన్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వాన్ని నడిపించేందుకు ఆయన సరైన వ్యక్తి. పెద్ద బాధ్యతలు అందుకునేందుకు సిద్ధంగా ఉండండి’’ అని యతీంద్ర (Yathindra Siddaramaiah) వ్యాఖ్యానించారు.

దీంతో ఆయన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. రాష్ట్రంలో సీఎం మార్పును ఉద్దేశించే ఆయన ఇలా మాట్లాడి ఉంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, సిద్ధరామయ్య తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌ (DK Shivakumar) పగ్గాలు చేపడతారనే ప్రచారం వేళ సతీశ్ పేరు తెర పైకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని