Lok Sabha Elections: అయిదో దశ ఎన్నికలు.. ముగిసిన పోలింగ్‌!

లోక్‌సభ ఎన్నికల అయిదో దశ పోలింగ్‌ ముగిసింది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 లోక్‌సభ నియోజకవర్గాల్లో 695 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది.

Updated : 20 May 2024 20:18 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) అయిదో దశ పోలింగ్‌ ముగిసింది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో మొత్తం 695 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఎన్నికల సంఘం (Election Commission) గణాంకాల ప్రకారం.. సాయంత్రం ఏడు గంటలకు దాదాపు 57.38 శాతం పోలింగ్‌ నమోదైంది. అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లో 73 శాతం, అత్యల్పంగా మహారాష్ట్రలో 48.88 శాతం ఓటింగ్‌ నమోదైంది.

అయిదో విడతలో జోరెవరిదో!

ఎన్నికల సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో చెదురుమదురు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఒడిశా తదితర రాష్ట్రాల్లోని కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలను ఏడు విడతల్లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో మొత్తంగా 543 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. అయిదో దశతో కలిపితే 428 సీట్లకు పోలింగ్‌ పూర్తయ్యింది. ఈసీ వివరాల ప్రకారం ఇప్పటివరకు నాలుగు దశల్లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 66.95 శాతం పోలింగ్ నమోదైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని