Vaccination Drive: గంటలో లక్ష మందికి పైగా వ్యాక్సిన్‌.. మధ్యప్రదేశ్‌ సరికొత్త రికార్డు!

24గంటల వ్యవధిలో 24.20 లక్షల మందికి పైగా మధ్యప్రదేశ్‌లో కొవిడ్‌ టీకాలు పంపిణీ చేశారు. అంటే గంటకు దాదాపు లక్ష డోసులకు పైగా ఇచ్చారు...

Updated : 26 Aug 2021 16:24 IST

భోపాల్‌: కరోనా నియంత్రణకు చేపట్టిన వ్యాక్సినేషన్‌లో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం సరికొత్త రికార్డును నెలకొల్పింది. 24గంటల వ్యవధిలో 24.20 లక్షల మందికి పైగా కొవిడ్‌ టీకాలు పంపిణీ చేసింది. అంటే గంటకు దాదాపు లక్ష డోసులకు పైగా పంపిణీ చేశారు. రెండు రోజుల పాటు చేపట్టిన మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో భాగంగా తమ ప్రభుత్వం ఈ సరికొత్త రికార్డు నెలకొల్పినట్టు వైద్యశాఖ ట్విటర్‌లో వెల్లడించింది. జూన్‌ 21న చేపట్టిన వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో కూడా ఒక్కరోజులో 17.62 లక్షల మందికి వ్యాక్సిన్‌ పంపిణీ చేసి మధ్యప్రదేశ్‌ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. 

తాజాగా, మరోసారి రెండు రోజుల పాటు చేపట్టిన మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో తొలిరోజైన బుధవారం 24.20లక్షల మందికి పైగా టీకాను పంపిణీ చేసినట్టు రాష్ట్ర వ్యాక్సినేషన్‌ అదనపు డైరెక్టర్‌ డాక్టర్‌ సంతోష్‌ శుక్లా వెల్లడించారు. రెండో డోసు పెండింగ్‌లో ఉన్నవారిని లక్ష్యంగా చేసుకొని ఈ క్యాంపెయిన్‌  నిర్వహించినట్టు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం రాత్రి నాటికి 4,20,97,917 డోసులు పంపిణీ చేసినట్టు అధికారులు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు