Arunachal Pradesh: కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్‌

Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి.

Published : 25 Apr 2024 12:44 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఈశాన్య రాష్ట్రం అరుణాచల్‌ ప్రదేశ్‌ (Arunachal Pradesh)లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో హున్లీ, అనినీ ప్రాంతంలో 313వ నంబరు జాతీయ రహదారిపై భారీగా కొండచరియలు (Landslide) విరిగిపోయాయి. ఫలితంగా హైవే కొట్టుకుపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చైనా సరిహద్దుల్లోని (China Border) దిబాంగ్‌ వ్యాలీ జిల్లాకు భారత్‌లోని ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి.

దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి దిబాంగ్‌ వ్యాలీ వెళ్లేందుకు ఇదొక్కటే మార్గం కావడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ జిల్లా చైనా, భూటాన్‌తో సరిహద్దులు పంచుకుంటోంది. ఇక సరిహద్దుల్లో క్లిష్టమైన భూభాగం ఉండే ఈ ప్రాంతంలో భద్రతా బలగాల రాకపోకలకు ఈ హైవే కీలకం. దీంతో తక్షణమే మరమ్మతు పనులు చేపట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అయితే, వాతావరణ పరిస్థితులు, ఇతర కారణాల దృష్ట్యా రహదారి తిరిగి అందుబాటులోకి రావాలంటే కనీసం మూడు రోజులు పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. 

ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య

ఇప్పటికే దిబాంగ్‌ వ్యాలీ ప్రజలకు ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది. ప్రస్తుతానికి ఈ ప్రాంతంలో ఆహారం, నిత్యావసరాల కొరత లేదని అధికారులు వెల్లడించారు. ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖండూ స్పందించారు. త్వరితగతిన మరమ్మతులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని