Landslide: మరోసారి కొండచరియల బీభత్సం.. కూలిన భవనాలు

ప్రకృతి విపత్తులతో హిమాచల్ ప్రదేశ్‌(Himachal Pradesh) అల్లాడిపోతోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి షేర్ చేసిన దృశ్యాల్లో ఆ విపత్తు తీవ్రత కనిపిస్తోంది.

Updated : 24 Aug 2023 14:48 IST

దేహ్రాదూన్‌: కొండచరియలు మరోసారి హిమాచల్‌ ప్రదేశ్‌(Himachal Pradesh)ను వణికించాయి. గురువారం కులు జిల్లాలో భారీగా కొండచరియలు(Landslide) విరిగిపడటంతో పలు ఎత్తైన భవనాలు, ఇళ్లు కూలిపోయాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకొని ఉంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు జాతీయ విపత్తు నిర్వహణ దళం(NDRF) రంగంలో దిగింది. స్థానిక సిబ్బందితో కలిసి సహాయక చర్యలు చేపడుతోంది. అలాగే భారత వాతావరణ శాఖ హిమాచల్‌కు రెడ్ అలర్ట్ జారీ చేసింది. గురువారం నుంచి రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇదిలా ఉంటే.. నేడు కొండచరియలు సృష్టించిన బీభత్సాన్ని ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు ట్విటర్(X)లో షేర్ చేశారు. ‘కులులో కొండచరియల కారణంగా భారీ స్థాయిలో వాణిజ్య సముదాయాలు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదాన్ని ముందే గుర్తించిన స్థానిక యంత్రాంగం అక్కడి నుంచి ప్రజలను తరలించింది’ అని వెల్లడించారు. 

చందమామ అందిన రోజు.. భరతజాతి మురిసిన రోజు

గత కొద్దికాలంగా హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh) ప్రకృతి విపత్తులతో అల్లాడిపోతోంది. భారీ వర్షాల కారణంగా కులు-మండీని ప్రాంతాలను కలిపే రహదారి దెబ్బతినడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రుతుపవనాలు ఆ రాష్ట్రంలోకి ప్రవేశించిన నాటి నుంచి భారీ వర్షాలకు చాలా చోట్ల మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. ఇప్పటి వరకు రూ.8,014 కోట్ల మేర నష్టం వాటిల్లిందని అంచనా. 300 మందికిపైగా మరణించినట్లు గణాంకాలను బట్టి తెలుస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు