MEA: ‘ఇజ్రాయెల్‌, ఇరాన్‌లకు వెళ్లొద్దు’.. భారత పౌరులకు విదేశాంగశాఖ అలెర్ట్‌

పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న వేళ.. ఇజ్రాయెల్‌, ఇరాన్‌లకు ప్రయాణం చేయవద్దని పౌరులకు భారత విదేశాంగశాఖ సూచించింది.

Published : 12 Apr 2024 18:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పశ్చిమాసియాలో ఉద్రిక్త (Israel Hamas Conflict) వాతావరణం నెలకొన్న వేళ భారత ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇజ్రాయెల్‌ (Israel), ఇరాన్‌లకు ప్రయాణం చేయవద్దని భారత పౌరులకు సూచించింది. తదుపరి ప్రకటన ఇచ్చే వరకూ ఇవి పాటించాలని తెలిపింది. ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ ఏ క్షణమైనా దాడులు చేయొచ్చనే వార్తలు వస్తున్న నేపథ్యంలో విదేశాంగ శాఖ ఈ అడ్వైజరీ జారీ చేసింది.

ప్రస్తుతం ఇజ్రాయెల్‌ లేదా ఇరాన్‌లో ఉంటున్న వారు స్థానిక భారత రాయబార కార్యాలయంతో టచ్‌లో ఉండాలని విదేశాంగ శాఖ సూచించింది. అక్కడ తమ పేర్లను నమోదు చేసుకోవాలని తెలిపింది. పౌరులు తమ భద్రతపై జాగ్రత్తలు పాటించాలని, బాహ్య కార్యకలాపాలను సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలని పేర్కొంది.

యూకే కుటుంబ వీసా కఠినతరం.. వేతన పరిమితి 55% పెంపు

ఇదిలా ఉంటే, డమాస్కస్‌లోని తమ రాయబార కార్యాలయంపై దాడి జరిగినప్పటి నుంచి ఇరాన్‌ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఆ దాడిలో ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ దళానికి చెందిన ఏడుగురు జనరల్స్‌ మృతి చెందడాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. దీనికి ఇజ్రాయెల్‌ కారణమని భావిస్తోన్న ఇరాన్‌.. వారిని శిక్షిస్తామని బహిరంగ ప్రకటనలు చేస్తోంది. అయితే, నేరుగా కాకుండా లెబనాన్‌ లేదా సిరియా నుంచి తన మద్దతుదారులైన హెజ్‌బొల్లా, ఇతర మిలిటెంట్‌ సంస్థలతో ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడులు చేయించొచ్చవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని