Indian Railways: అనువాదం తెచ్చిన తంటా! ‘ట్రాన్స్‌లేషన్‌’తో రైల్వే అభాసుపాలు

హిందీలో ఉన్న ఓ ప్రాంతం పేరును మలయాళంలోకి యథాతథంగా అనువాదం చేసిన రైల్వే సిబ్బంది.. దాన్ని రైలు బోర్డుపై పొందుపర్చారు. తీరా అది కాస్త వేరే అర్థానికి దారితీసింది.

Updated : 13 Apr 2024 23:48 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒక భాషలోని పదాన్ని మరో భాషలోకి మార్చే క్రమంలో తగు జాగ్రత్తలు అవసరం. ఏ మాత్రం నిర్లక్ష్యంగా వహించినా అర్థం మారిపోయి అభాసుపాలయ్యే అవకాశం ఉంది. సరిగ్గా ఇలాంటి తప్పిదమే భారతీయ రైల్వే (Indian Railways)లో జరిగింది. హిందీలో ఉన్న ఓ ప్రాంతం పేరును యథాతథంగా మలయాళంలోకి అనువాదం చేసిన సిబ్బంది.. దాన్ని రైల్వే సూచిక బోర్డు మీదా పొందుపర్చారు. తీరా అది కాస్తా వేరే అర్థానికి దారితీయడంతో.. ఈ వ్యవహారం కాస్త నెట్టింట వైరల్‌గా మారింది.

మోదీతో ‘గేమ్‌’.. ఆ సొట్ట బుగ్గల సుందరి ఎవరు..?

ఝార్ఖండ్‌లోని హటియా నుంచి కేరళలోని ఎర్నాకుళం మధ్య ‘హటియా ఎర్నాకుళం ధర్తీ ఎక్స్‌ప్రెస్‌’ రాకపోకలు సాగిస్తుంది. ఆ రైలు బోర్డుపై ‘హటియా’ అనే పదాన్ని మలయాళంలో రాయకుండా దాన్ని అనువాదం చేశారు. ఈ క్రమంలోనే హటియా కాస్తా ‘హత్య’గా మారింది. మలయాళంలో అదే అర్థం వచ్చే పదాన్ని బోర్డుపై ఎక్కించడం గమనార్హం. దీంతో తప్పిదంతో కూడుకున్న బోర్డు ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆన్‌లైన్‌ ట్రాన్స్‌లేషన్‌ మీద అతిగా ఆధారపడి, ఉన్నది ఉన్నట్టు అనువదిస్తే ఇలాగే ఉంటుందని నెటిజన్లు స్పందించారు. అనువాద క్రమంలో ఈ తప్పు జరిగిందని, గుర్తించిన వెంటనే దాన్ని సరిచేశామని రాంచీ డివిజన్‌ అధికారులు వివరణ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని