Congress: ‘మోదీ-అదానీ’తో రాహుల్‌ ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ.. కాంగ్రెస్‌ వీడియో చూశారా?

Eenadu icon
By National News Team Updated : 09 Dec 2024 14:06 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

దిల్లీ: అదానీ వ్యవహారంపై పార్లమెంట్‌లో చర్చ జరపాలన్న డిమాండ్‌తో ప్రతిపక్ష కాంగ్రెస్‌ కొద్ది రోజులుగా ఆందోళన చేస్తోన్న సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం కూడా పార్లమెంట్ ఆవరణలో విపక్ష నేతలు నిరసన చేపట్టారు. ఈసందర్భంగా ఓ ఆసక్తికర దృశ్యం కన్పించింది. ప్రధాని మోదీ (PM Modi), పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీ పాత్రధారులను కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు.

ఈ ఆందోళనల్లో (Opposition Protests on Adani Issue) భాగంగా కాంగ్రెస్‌ ఎంపీలు మాణికం ఠాగుర్‌, సప్తగిరి శంకర్‌ ఉలక తమ ముఖాలకు మోదీ, అదానీ (Gautam Adani) ఫొటోలున్న మాస్క్‌లు ధరించి వచ్చారు. వారిద్దరినీ ఫొటో తీస్తూ ‘మీ ఇద్దరి మధ్య ఉన్న బంధమేంటో చెప్పాలని’ లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు. దానికి ఆ పాత్రధారులు.. ‘‘ఏం చేసినా మేం కలిసే చేశాం.. మాది ఏళ్లనాటి బంధం’’ అని సమాధానమిచ్చారు. మోదీ, అదానీ ఒకటేనని చెప్పే క్రమంలో విపక్ష పార్టీ ఇలా చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్‌ (Congress) తమ ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది.

ఇదిలాఉండగా.. జార్జ్‌ సోరోస్‌ ఫౌండేషన్‌కు కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీకి ఆర్థిక సంబంధాలున్నాయని భాజపా చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై నేడు పార్లమెంట్‌లోనూ గందరగోళం చెలరేగింది. దీనిపై చర్చ జరపాలని భాజపా ఎంపీలు డిమాండ్‌ చేశారు. దీంతో ఉభయసభల్లోనూ కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. ఈ అంశాన్ని చాలా తీవ్రంగా పరిగణించాలని, రాజకీయాలకు అతీతంగా దీనిపై చర్చ జరిపేందుకు ముందుకురావాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు పిలుపునిచ్చారు.


Tags :
Published : 09 Dec 2024 12:54 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు