పాక్‌ శక్తి స్వయంగా చూసేందుకు నాడు లాహోర్‌కు వెళ్లా : ప్రధాని

పాకిస్థాన్‌ ఎంత శక్తిమంతమైందో స్వయంగా చూసేందుకే తాను లాహోర్‌కు వెళ్లినట్లు ప్రధాని మోదీ తెలిపారు.

Updated : 25 May 2024 08:13 IST

దిల్లీ: పాకిస్థాన్‌ ఎంత శక్తిమంతమైందో స్వయంగా చూసేందుకే తాను లాహోర్‌కు వెళ్లినట్లు ప్రధాని మోదీ తెలిపారు. తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ తన పాక్‌ పర్యటనను గుర్తుచేసుకున్నారు. 2015 డిసెంబరులో అఫ్గానిస్థాన్‌ పర్యటనకు వెళ్లిన మోదీ అక్కడి నుంచి తిరిగొస్తూ ఆకస్మికంగా లాహోర్‌లో దిగిన సంగతి తెలిసిందే. ఆ రోజు అప్పటి పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ పుట్టినరోజు కావడంతో మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. 2004 తర్వాత ఓ భారత ప్రధాని దాయాది దేశంలో అడుగుపెట్టడం అదే తొలిసారి. ‘‘లాహోర్‌లో ఓ జర్నలిస్టు వీసా లేకుండా తమ దేశానికి ఎలా వచ్చానని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒకప్పుడు ఇది మా భారత్‌లో భాగమే కదా అని నేనన్నా. ఈ మధ్య పాక్‌ ప్రభుత్వం ఆందోళనలో ఉంది. దానికి నేను కూడా ఓ మూలకారణమని తెలుసు.  మన దేశంలోనూ కొంతమంది వ్యక్తులు (కాంగ్రెస్‌ నేతలను ఉద్దేశించి) దాయాదిపై సానుభూతి చూపిస్తున్నారు. ముంబయి పేలుళ్లకు పాల్పడిన కసబ్‌ మనవాడేనంటూ మరో నేత అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు విన్నప్పుడు సిగ్గుతో తల కొట్టేసినట్లు అవుతోంది’’ అని మోదీ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు