Ayodhya Ram Mandir: ‘11 రోజుల ప్రత్యేక అనుష్ఠానం’ పాటించనున్న మోదీ

అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో నేడు ప్రధాని మోదీ(Modi) ప్రత్యేక సందేశం ఇచ్చారు. 

Updated : 12 Jan 2024 10:58 IST

దిల్లీ: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సమీపిస్తోన్న తరుణంలో ఆ మహత్కార్యాన్ని వీక్షించేందుకు దేశమంతా ఎదురుచూస్తోంది. ఈ ప్రాణ ప్రతిష్ఠకు ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉన్నందున శుక్రవారం ప్రధాని మోదీ(Modi) ప్రత్యేక సందేశం ఇచ్చారు. ఈ రోజు నుంచి తాను ప్రత్యేక అనుష్ఠానాన్ని అనుసరిస్తానని వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఆడియో సందేశం విడుదల చేశారు. దానిని తన అధికారిక యూట్యూబ్ ఛానల్‌లో పోస్టు చేశారు. ఈ మహోన్నత ఘట్టాన్ని కనులారా వీక్షించే అవకాశం కలగడం తన అదృష్టమని పేర్కొన్నారు.

‘రామాలయ ప్రాణప్రతిష్ఠకు ఇంకా 11 రోజులే మిగిలి ఉంది. ఈ ప్రారంభోత్సవానికి దేశ ప్రజల తరఫున ప్రతినిధిగా ఉండటం నా అదృష్టం. దీనిని దృష్టిలో ఉంచుకొని నేటి నుంచి 11 రోజుల ప్రత్యేక ఆరాధన మొదలు పెడుతున్నాను. ప్రస్తుతం నేను ఎంతో ఉద్వేగంతో ఉన్నాను. నా మనసులో తొలిసారి ఇలాంటి భావాలు మెదులుతున్నాయి. దేవుడి ఆశీస్సుల వల్లే కొన్ని వాస్తవ రూపం దాల్చుతాయి. ఈ ప్రారంభోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులందరికీ ఒక పవిత్రమైన సందర్భం’ అంటూ సందేశం ఇచ్చారు.

జనవరి 12న ఛత్రపతి శివాజీ మాతృమూర్తి జయంతి. ‘జిజియాబాయి గురించి తలుచుకున్నప్పుడు నాకు నా తల్లి గుర్తుకువస్తుంది. ఆమె తన చరమాంకం వరకూ రాముడి సేవలోనే తరించింది’ అని మోదీ ఉద్వేగానికి గురయ్యారు. ప్రధాని తల్లి హీరాబెన్‌.. 99 ఏళ్ల వయసులో 2022లో కన్నుమూశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని