Salman Khan: సల్మాన్‌ ఇంటివద్ద కాల్పులు.. ‘పిస్టల్‌’ కోసం నదిలో గాలింపు

బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ (Salman Khan) ఇంటివద్ద జరిగిన కాల్పులకు వాడిన తుపాకీ కోసం సూరత్‌లోని తపతీ నదిలో గాలింపు చేపట్టారు.

Published : 22 Apr 2024 18:47 IST

సూరత్‌: బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ (Salman Khan) ఇంటివద్ద జరిగిన కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ దాడికి సంబంధించి ఇప్పటికే ఇద్దరు అనుమానితులను అరెస్టు చేసిన పోలీసులు.. వారు వాడిన తుపాకీ కోసం గాలిస్తున్నారు. ఇందుకోసం సూరత్‌లోని తపతీ నదిలో వేట కొనసాగిస్తున్నారు.

సల్మాన్‌ ఇంటి ముందు దాడులు జరిపినట్లు అనుమానిస్తోన్న విక్కీ గుప్తా, సాగర్‌ పాల్‌లను ముంబయి, కచ్‌ పోలీసు బృందాలు ఇటీవల అరెస్టు చేశాయి. ఈ ఘటన అనంతరం తాము ముంబయి నుంచి సూరత్‌.. అక్కడినుంచి భుజ్‌ వైపు రైల్లో పారిపోయినట్లు దర్యాప్తులో నిందితులు వెల్లడించారు. ఈక్రమంలో తమ వద్దనున్న తుపాకీని రైల్వే బ్రిడ్జి పైనుంచి తపతీ నదిలో పడేసినట్లు చెప్పారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పిస్టల్‌ కోసం నదిలో వేట కొనసాగించారు.

‘పచ్చని’ పోలింగ్‌ బూత్‌.. వినూత్న ప్రయత్నానికి ఓటర్లు ఫిదా!

‘ఇద్దరు నిందితులు ఉపయోగించిన తుపాకీని స్వాధీనం చేసుకోవడానికి ముంబయి పోలీసులు సూరత్‌ వచ్చారు. ఆయుధాన్ని వెతికేందుకు మా బృందాలు వారికి సహకరిస్తున్నాయి’ అని సూరత్‌ పోలీస్‌ కమిషనర్‌ అనుపమ్‌సింగ్ పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టుగా పేరొందిన ఇన్‌స్పెక్టర్‌ దయా నాయక్‌ కూడా వారితో ఉన్నారన్నారు. స్థానిక ఈతగాళ్లు, మత్స్యకారుల సాయంతో పిస్టల్‌ కోసం నదిలో గాలిస్తున్నామని చెప్పారు.

ఇదిలాఉంటే, కేవలం సంచలనం సృష్టించేందుకే సల్మాన్‌ ఇంటివద్ద కాల్పులు జరిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన వెనక గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌, అతడి సోదరుడు అన్మోల్‌ బిష్ణోయ్‌ల హస్తం ఉన్నట్లు ముంబయి పోలీసులు ప్రకటించారు. ప్రస్తుతం లారెన్స్‌ బిష్ణోయ్‌ గుజరాత్‌లోని సబర్మతీ సెంట్రల్‌జైల్లో ఉండగా.. అతడి సోదరుడు మాత్రం అమెరికా లేదా కెనడాలో ఉన్నట్లు భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని