Polling booth: ‘పచ్చని’ పోలింగ్‌ బూత్‌.. వినూత్న ప్రయత్నానికి ఓటర్లు ఫిదా!

ఎన్నికల వేళ.. ఎండలో నిలబడి ఓటు వేయాలంటే ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. ఆహ్లాదకర వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు తమిళనాడు అధికార యంత్రాంగం చేసిన వినూత్న ఆలోచన ఆకర్షిస్తోంది.

Updated : 22 Apr 2024 16:53 IST

చెన్నై: దేశంలో లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) సందడి కొనసాగుతోంది. మొత్తం ఏడు దశల్లో ఇవి జరుగుతుండగా.. ఇప్పటికే మొదటి విడత పూర్తయ్యింది. అయితే, ఈ వేసవిలో భానుడి ప్రతాపానికి  మండుటెండల్లో క్యూలో నిలబడి ఓటు వేయాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. ఈనేపథ్యంలోనే ఆహ్లాదకర వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు తమిళనాడు (Tamil Nadu) అధికార యంత్రాంగం చేసిన వినూత్న ఆలోచన అందరినీ ఆకర్షిస్తోంది.

ఎండ నుంచి ఉపశమనం కోసం తిరుపత్తూరు జిల్లాలోని పోలింగ్‌ బూత్‌ ఎదుట కొబ్బరి, వెదురు, అరటి ఆకులతో పందిరి వేసి అందంగా ముస్తాబు చేశారు. దీంతో అక్కడ పండగ వాతావరణం నెలకొంది. ఎలాంటి ఇబ్బందిలేకుండా వృద్ధులు సైతం ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఐఏఎస్‌ అధికారిణి సుప్రియసాహు ‘ఎక్స్’లో షేర్‌ చేశారు. ‘‘ఎండ, వడగాల్పుల నుంచి ఓటర్లకు ఉపశమనం కలిగించేలా.. పర్యావరణం కోసం పనిచేసే ఓ స్వచ్ఛంద సంస్థ నేతృత్వంలోని యువకులతో కలిసి జిల్లా యంత్రాంగం గ్రీన్‌ పోలింగ్‌ బూత్‌ను ఏర్పాటు చేసింది. పచ్చని తోరణాలు ఓటర్లకు స్వాగతం పలికాయి’’ అని పేర్కొన్నారు.

కోర్సు ఎందుకు.. హైస్కూల్‌ తర్వాతే లా ప్రాక్టీస్‌ చేయండి: సుప్రీం ఆగ్రహం

సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకొంది. ‘‘అద్భుతమైన చొరవ. ఈ ఆలోచన అదుర్స్’’ అని ఒకరు.. ‘‘చూడటానికి ఎంతో అందంగా ఉంది. చాలా బాగా అలంకరించారు. ఈ గొప్ప ప్రయత్నానికి ధన్యవాదాలు’’ అని మరొకరు కామెంట్‌ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని