Naveen Patnaik: పాండియన్‌పై ఆగని విమర్శలు.. నవీన్‌ ఏమన్నారంటే..?

తనను వెన్నంటి ఉండే సహాయకుడు వీకే పాండియన్‌పై వస్తోన్న విమర్శలకు బీజేడీ చీఫ్‌ నవీన్‌ పట్నాయక్‌ (Naveen Patnaik) స్పందించారు. 

Published : 08 Jun 2024 16:43 IST

భువనేశ్వర్: బిజూజనతాదళ్ (BJD) చీఫ్ నవీన్‌ పట్నాయక్‌ (Naveen Patnaik)కు అత్యంత విశ్వాసపాత్రుడిగా పేరుపొందిన వీకే పాండియన్‌పై ఇతర పార్టీలు తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల తర్వాత కూడా ఆ విమర్శలు ఆగలేదు. వాటిపై తాజాగా నవీన్‌ స్పందించారు.

‘‘విద్య, వైద్యం, క్రీడా రంగాలతో పాటు ఆలయాల పునరుద్ధరణ వంటి కార్యక్రమాల కోసం తన సేవలు అందించి సహకరించారు. పాండియన్ బీజేడీలో చేరినప్పటికీ.. అతనికి ఎలాంటి పదవి లేదు. నా వారసుడు ఎవరు అని అడిగిన ప్రతిసారీ పాండియన్‌ కాదని చెప్పాను. అదే విషయం మళ్లీ చెప్తున్నాను. ఒడిశా ప్రజలే నా వారసుడిని నిర్ణయిస్తారు’’ అని నవీన్‌ స్పష్టంచేశారు. అలాగే సైక్లోన్లు, కొవిడ్ సమయంలో ఆయన అద్భుతమైన పనితీరు చూపారని కొనియాడారు. ఆయన ఎంతో నిజాయతీ కలిగిన వ్యక్తి అని, అందుకు ఆయన్ను గౌరవించాలన్నారు. చాలాకాలం తర్వాత ఓటమిని ఎదురుచూసిన తమ పార్టీ.. ప్రజల తీర్పును గౌరవిస్తుందన్నారు. 4.5 కోట్ల మంది ఒడిశా ప్రజలు తన కుటుంబమని, అధికారం లేకపోయినా వారికి అందుబాటులో ఉంటానని చెప్పారు.

ఇదిలాఉంటే.. ఇటీవల ఎన్నికల ఫలితాల్లో బీజేడీని ఓడించి భాజపా విజయాన్ని దక్కించుకుంది. అప్పటినుంచి పాండియన్ మీడియా నుంచి అదృశ్యమైపోయారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటినుంచి ఆయన ఎవరికీ అందుబాటులో లేకపోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా బీజేడీ చీఫ్ ఎక్కడికి వెళ్లినా ఆయన్ను వెన్నంటే ఉంటారనే పేరుంది. అయితే ఇటీవల పలు సందర్భాల్లో నవీన్‌ వెంట ఆయన కనిపించకపోవడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు