Bihar Assembly Elections: కోటి ప్రభుత్వ ఉద్యోగాలు.. కోటి మంది లఖ్‌పతి దీదీలు: బిహార్‌లో ఎన్డీయే మ్యానిఫెస్టో

Eenadu icon
By National News Team Updated : 31 Oct 2025 11:47 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

పట్నా: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ మరికొన్ని రోజుల్లో జరగనుంది. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచార జోరు పెంచాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు హామీల వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా బిహార్‌ అధికార ఎన్డీయే కూటమి శుక్రవారం ఎన్నికల మ్యానిఫెస్టోను (NDA Manifesto) విడుదల చేసింది. వలస కార్మికులను ఆకట్టుకునేలా రాష్ట్రంలో కోటి ప్రభుత్వ ఉద్యోగాలు సృష్టిస్తామని హామీ ఇచ్చింది. (Bihar Assembly Elections)

పట్నాలో ఈ ఉదయం జరిగిన కార్యక్రమంలో ‘సంకల్ప పత్ర’ పేరుతో భాజపా (BJP) అధ్యక్షుడు జేపీ నడ్డా, బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ ఈ మ్యానిఫెస్టోను విడుదల చేశారు. ఎల్జేపీ (రాంవిలాస్‌) పార్టీ చీఫ్‌ చిరాగ్‌ పాసవాన్‌ కూడా పాల్గొన్నారు.

మ్యానిఫెస్టోలోని ముఖ్యాంశాలివే..

  • రాష్ట్రంలోని యువతకు కోటి ప్రభుత్వ ఉద్యోగాలు. ప్రతి జిల్లాలో మెగా నైపుణ్య కేంద్రాల ఏర్పాటు
  • కేజీ టు పీజీ వరకు నాణ్యమైన ఉచిత విద్య
  • ఏడాదికి రూ.లక్ష వరకు సంపాదించేలా కోటి మంది మహిళలను ‘లఖ్‌పతి దీదీ’లుగా మార్చడమే లక్ష్యం. మహిళలు వ్యాపారాలు ప్రారంభించేందుకు రూ.2 లక్షల వరకు ఆర్థికసాయం.
  • ఈబీసీలకు రూ.10 లక్షల వరకు ఆర్థిక ప్రోత్సాహకాలు. రాష్ట్రంలో సామాజిక-ఆర్థిక పరిస్థితులను అంచనా వేసేందుకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు
  • కర్పూరీ ఠాకూర్‌ కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద ప్రతి రైతుకు ఏడాదికి రూ.9వేలు పెట్టుబడి సాయం. మూడు విడతల్లో ఈ మొత్తం చెల్లింపు
  • బిహార్‌లో ఏడు ఎక్స్‌ప్రెస్‌వేలు, నాలుగు నగరాల్లో మెట్రో రైలు సేవల ఏర్పాటు.
  • 5 ఏళ్లలో రూ.50 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించేలా ఇండస్ట్రియల్‌ పార్కుల ఏర్పాటు
  • ప్రతి జిల్లాలో తయారీ యూనిట్లు , మెడికల్‌ కాలేజీల ఏర్పాటు
  • గిగ్‌ వర్కర్లు, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం
Tags :
Published : 31 Oct 2025 10:57 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు