Nitin Gadkari: సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్‌ గడ్కరీ

Nitin Gadkari: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ సభలో మాట్లాడుతూ స్పృహతప్పి పడిపోయారు. 

Published : 24 Apr 2024 17:09 IST

ముంబయి: కేంద్ర మంత్రి, భాజపా (BJP) అభ్యర్థి నితిన్‌ గడ్కరీ (Nitin Gadkari) బుధవారం అస్వస్థతకు గురయ్యారు. మహారాష్ట్ర (Maharashtra)లోని యవత్మాల్‌లో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ స్పృహ కోల్పోయారు. యవత్మాల్‌-వాశిమ్‌ స్థానం నుంచి మహాయుతి కూటమి తరఫున సీఎం ఏక్‌నాథ్‌ శిందే వర్గానికి చెందిన శివసేన నాయకురాలు రాజశ్రీ పాటిల్‌ పోటీ చేస్తున్నారు. ఆమె తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న గడ్కరీ సభలో మాట్లాడుతుండగా ఒక్కసారిగా కిందపడిపోయారు. ఇతర నేతలు, కార్యకర్తలు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. 

ప్రస్తుతం ఆయనను వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా వరుసగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ఆయన.. విపరీతమైన ఎండ, ఉక్కపోత కారణంగా అస్వస్థతకు గురైనట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

గత పదేళ్లుగా నాగ్‌పుర్‌ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న గడ్కరీ.. తాజా ఎన్నికల్లోనూ మరోసారి అక్కడినుంచే బరిలోకి దిగారు. తొలి విడతలో భాగంగా ఏప్రిల్‌ 19న అక్కడ పోలింగ్‌ జరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని