Viral video: మనవరాళ్లతో నితిన్‌ గడ్కరీ..వీడియో వైరల్‌

భాజపా సీనియర్‌ నేత నితిన్‌ గడ్కరీ చేసిన పోస్టు నెట్టింట చక్కర్లు కొడుతోంది.   

Published : 08 Jun 2024 15:41 IST

దిల్లీ: భారతీయ జనతా పార్టీ (భాజపా) సీనియర్ నాయకుడు నితిన్ గడ్కరీ(Nitin Gadkari) సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన వీడియో వైరల్‌గా మారింది. వీడియోలో గడ్కరీని చూడడానికి వచ్చిన ఆయన మనవరాళ్లను ప్రేమతో కౌగిలించుకొని ఆనందం వ్యక్తంచేస్తున్న దృశ్యాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.  నా మనవరాళ్ల రాక అనుకోని ఆనందాన్ని తెచ్చింది, నా రోజును మరింత ప్రకాశవంతం చేసింది అంటూ ఆయన వీడియోకు వ్యాఖ్యను జత చేశారు.

లోక్‌సభ ఎన్నికల్లో నితిన్‌ గడ్కరీ నాగ్‌పుర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి వరుసగా మూడోసారి గెలుపొందారు. కాంగ్రెస్‌ అభ్యర్థిపై 1,37,603 ఓట్ల తేడాతో విజయకేతనం ఎగురవేశారు. దీంతో వారి ఇంట్లో సందడి నెలకొంది. కుటుంబసభ్యులు, కార్యకర్తలు, పార్టీ నేతలు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు. 

ఎంపీగా నియోజకవర్గ అభివృద్ధికి మరింత పట్టుదలతో పని చేస్తానని గడ్కరీ పేర్కొన్నారు. నాగ్‌పుర్‌ను దేశంలోనే అత్యంత సుందరమైన, పరిశుభ్రమైన, కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దాలన్న తన కలను నెరవేర్చేందుకు కృషి చేస్తానన్నారు. నాగ్‌పూర్, విదర్భ ప్రాంతాల్లో పారిశ్రామికీకరణను అభివృద్ధి చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని