Nitish Kumar: నా కుటుంబం కోసం కాకుండా మీ కోసమే పనిచేశా.. ఎన్నికల ముందు నీతీశ్ వీడియో

Eenadu icon
By National News Team Updated : 01 Nov 2025 10:53 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌డెస్క్: బిహార్‌లో ఎన్నికలు సమీపిస్తున్నాయి (Bihar Assembly Elections). మరో ఐదు రోజుల్లో తొలి దశ ఎన్నికలకు పోలింగ్‌ జరగనుంది. ఈ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ (Nitish Kumar) ప్రజలను ఉద్దేశిస్తూ.. ఓ వీడియో విడుదల చేశారు. గత రెండు దశాబ్దాలుగా తమ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ.. ఇన్నాళ్లు తాను ప్రజల కోసమే పని చేశానని వ్యాఖ్యానించారు. 

గతంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు చాలా దారుణంగా ఉండేవన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట వాటిని మెరుగుపరిచినట్లు తెలిపారు. దీంతోపాటు యువతకు విద్య, ఆరోగ్యం, రోడ్లు, విద్యుత్‌, నీటి సరఫరా, వ్యవసాయం, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెంచామన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్- ఆర్జేడీలపై తీవ్ర విమర్శలు చేశారు. ఆ కూటమి అధికారంలో ఉన్నప్పుడు మహిళలకు ఏమీ చేయలేదన్నారు. తమ ప్రభుత్వంలో మహిళలకు సాధికారత కల్పించి, స్వతంత్రులను చేశామన్నారు. సమాజంలోని అన్నివర్గాల అభివృద్ధి కోసమే పనిచేశాం తప్ప, తమ కుటుంబాల కోసం కాదని నీతీశ్‌ కుమార్‌ అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ (PM Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం బిహార్‌ అభివృద్ధికి పూర్తి మద్దతు ఇస్తుందన్నారు.

ఎన్డీయే మాత్రమే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలదన్నారు. కేంద్రం, రాష్ట్రాల్లో ఎన్డీయే కూటమి ఉండటం వల్లే దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు.   ఈ సందర్భంగా తమకు మరో అవకాశం ఇవ్వాలని ప్రజలను అభ్యర్థించారు. బిహార్‌ అభివృద్ధి ఎన్డీయే అధికారంలో ఉంటేనే అవుతుందని నొక్కి చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈనెల 6, 11 తేదీల్లో ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి. 14న ఫలితాలు వెలువడనున్నాయి.

Tags :
Published : 01 Nov 2025 10:42 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని