Amit Shah: సీఏఏ అమలును ఎవ్వరూ ఆపలేరు : అమిత్‌ షా

పౌరసత్వ (సవరణ) చట్టం అమలును ఎవ్వరూ అడ్డుకోలేరని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా (Amit Shah) మరోసారి స్పష్టం చేశారు.

Published : 29 Nov 2023 20:45 IST

కోల్‌కతా: పౌరసత్వ (సవరణ) చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పకుండా అమలు చేస్తుందని.. దాన్ని ఎవ్వరూ ఆపలేరని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా (Amit Shah) స్పష్టం చేశారు.  2024 లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Elections) సమీపిస్తున్న వేళ పశ్చిమబెంగాల్‌లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అవినీతి, రాజకీయ హింస, బుజ్జగింపు రాజకీయాలను ప్రస్తావించిన ఆయన.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వీటన్నింటిని తరిమికొట్టేందుకు భాజపాను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు.

పౌరసత్వ (సవరణ) చట్టంపై (CAA) కేంద్ర మంత్రి అమిత్‌ షా మాట్లాడుతూ.. మమతా బెనర్జీ (Mamata Banerjee) వ్యతిరేకిస్తున్నప్పటికీ దీని అమలును ఎవ్వరూ అడ్డుకోలేరన్నారు. విపక్షాలు వ్యతిరేకిస్తున్నందునే దీనిపై ఆలస్యం జరుగుతోందన్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతృత్వంలో రాష్ట్రంలో అవినీతి, చొరబాట్లు, రాజకీయ హింస కొనసాగుతోందని ఆరోపించారు. దీదీ పాలనలో రాష్ట్రంలో చొరబాట్లు పెరిగాయన్నారు. వీటికి ముగింపు పలకాలంటే భాజపాను ఎన్నుకోవాలన్నారు. కేంద్రంలో కాంగ్రెస్‌ హయాంలో కంటే భాజపా ప్రభుత్వంలోనే పశ్చిమ బెంగాల్‌కు అధిక నిధులు కేటాయించామన్నారు. 2024 వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో భాజపా చూపించే పనితీరు.. రాష్ట్రంలో తదుపరి అసెంబ్లీ ఎన్నికలకు పునాది వేస్తుందని అన్నారు.

Rat Hole Mining: నిషేధించిన విధానమే.. 41మందిని కాపాడింది!

ఇదిలాఉంటే, గత లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్‌లో భాజపా మెరుగైన పనితీరు కనబరిచింది. మొత్తం 42 లోక్‌సభ స్థానాలకు గాను 18చోట్ల విజయం సాధించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ 77 స్థానాల్లో గెలుపొందింది.  ఇలా రాష్ట్రంలో కాషాయ పార్టీ ప్రాబల్యం క్రమంగా పెరుగుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని