Scrap Mafia: రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్‌ మాఫియా డాన్‌

స్క్రాప్‌ మెటీరియల్ మాఫియా ద్వారా రూ.కోట్లు ఆర్జించిన గ్యాంగ్‌స్టర్‌ రవికానా, అతడి ప్రియురాలిని థాయ్‌లాండ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Updated : 24 Apr 2024 16:50 IST

దిల్లీ: స్క్రాప్‌ మెటీరియల్‌ మాఫియా (Scrap Mafia) ద్వారా అక్రమంగా రూ.కోట్లు సంపాదించిన రవి కానా, అతడి ప్రియురాలు కాజల్ ఝా ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. థాయ్‌లాండ్‌ పోలీసులు వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. నోయిడా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రవి కానా పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ గ్యాంగ్‌స్టర్. స్క్రాప్‌ మెటీరియల్‌ను సేకరించి అమ్మేందుకు రానా 16 మందితో కూడిన గ్యాంగ్‌ను నడిపేవాడు. దిల్లీలోని పలువురు వ్యాపారవేత్తలను మోసగించి అనతికాలంలో రూ.120 కోట్లకు పైగా సంపాదించాడు. దోపిడీ, కిడ్నాపింగ్‌ వంటి పలు కేసుల్లో కీలక నిందితుడు. రానాతో సహా గ్యాంగ్‌లోని వారిని పట్టుకునేందుకు నోయిడా పోలీసులు ప్రణాళిక వేశారు.  ఈ క్రమంలోనే థాయ్‌లాండ్‌ పోలీసులతో సంయుక్తంగా ఆపరేషన్‌ చేపట్టారు.

సుప్రీం సీరియస్‌.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు

ఎప్పటికప్పుడు రానాకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. జనవరిలో అతడిపై రెడ్‌ కార్నర్‌ నోటీస్‌ను జారీ చేశారు. ఇప్పటివరకు రానా గ్యాంగ్‌లోని ఆరుగురిని అరెస్టు చేశారు. తమ కార్యకలాపాల కోసం వినియోగించిన పలు స్ర్కాప్‌ గోడౌన్లను సీజ్‌ చేశారు. అతడితో సహా అనుచరుల అక్రమాస్తులను జప్తు చేశారు. రవి తన ప్రియురాలు కాజల్‌కు బహుమతిగా ఇచ్చిన బంగ్లాలో సోదాలు చేపట్టారు. దిల్లీలోని ఈ బంగ్లా విలువ రూ.100 కోట్లు. ఉద్యోగం కోసం రవిని సంప్రదించిన కాజల్‌ ప్రస్తుతం ఆ గ్యాంగ్‌లో కీలక వ్యక్తి. అతడి బినామీ ఆస్తులకు ఆమె ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తోంది. థాయ్‌ అధికారులతో జరిపిన సంయుక్త ఆపరేషన్‌ వలలో ఎట్టకేలకు వీరిద్దరూ చిక్కారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని