Eknath Shinde: ఎన్నికల్లో.. ‘ఉల్లి’ ఏడిపించింది..! ‘మహా’ సీఎం కీలక వ్యాఖ్యలు

లోక్‌సభ ఎన్నికల ఫలితాల విషయంలో ‘ఉల్లి’ పంట తమను ఏడిపించిందని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందే వ్యాఖ్యానించారు.

Published : 12 Jun 2024 00:09 IST

ముంబయి: మహారాష్ట్ర (Maharashtra)లో భాజపా- శివసేన- ఎన్సీపీలతో కూడిన అధికార కూటమికి లోక్‌సభ ఎన్నికలు అంతగా కలిసిరాలేదు. 48 స్థానాల్లో కేవలం 17 స్థానాలకే పరిమితమైంది. ఈ పరిణామాలపై ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే (Eknath Shinde) కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని వ్యవసాయ గడ్డు పరిస్థితులకు.. ఎన్నికల ఫలితాల రూపంలో తమ కూటమి భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. నాసిక్‌ ప్రాంతంలో ‘ఉల్లి’ ఏడిపించిందని వ్యాఖ్యానించారు.

‘‘నాసిక్ ప్రాంతంలో ‘ఉల్లి’ కారణంగా సమస్యలు ఎదుర్కొన్నాం. అవి మమ్మల్ని ఏడిపించాయి. మరాఠ్వాడాలో సోయాబీన్, విదర్భలో పత్తి పంటలు మమ్మల్ని దెబ్బతీశాయి. నూతన కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలిసి.. ఉల్లి, సోయాబీన్, పత్తి పంటలకు మద్దతు ధరపై చర్చిస్తా. రాష్ట్రంలోని వ్యవసాయ సంబంధిత సమస్యలపై ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడాను’’ అని ఓ కార్యక్రమంలో సీఎం శిందే తెలిపారు.

ప్రియాంక పోటీ చేస్తే.. మోదీ ఓడిపోయేవారు: రాహుల్‌ గాంధీ

దేశీయంగా ఉల్లి ధరలను అదుపులో ఉంచేందుకు గతేడాది డిసెంబరులో ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది. దీనిపై మహారాష్ట్రలోని ఉల్లి రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ పంట దిగుబడులకు నాసిక్‌ ప్రసిద్ధి. ఆంక్షలు ఎత్తివేయాలని పలుమార్లు ఆందోళనలు కూడా జరిగాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది మే మొదటివారంలో కేంద్రం ఆంక్షలు ఎత్తివేసింది. అయితే.. లోక్‌సభ ఎన్నికల్లో నాసిక్‌లో శివసేన, డిండౌరీలో భాజపా ఓడిపోయాయి. భాజపా-శివసేన-ఎన్సీపీ కూటమి మరాఠ్వాడాలో ఒక సీటు, విదర్భలో రెండు స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు