Vande Bharat: ‘వందే భారత్‌’ జోరు.. రెండు కోట్ల మంది ప్రయాణం!

‘వందే భారత్‌’ రైళ్లలో ఇప్పటివరకు రెండు కోట్ల మందికిపైగా ప్రయాణికులు రాకపోకలు సాగించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

Published : 16 Apr 2024 00:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రయాణికుల సేవల విషయంలో ‘వందే భారత్‌ (Vande Bharat)’ రైళ్లు దూసుకెళ్తున్నాయి. 2019 ఫిబ్రవరి 15న దిల్లీ- వారణాసి మధ్య తొలి సర్వీసు మొదలు ఈ ఏడాది మార్చి 31 వరకు ఈ సెమీ హైస్పీడ్‌ రైళ్లలో రెండు కోట్ల మందికిపైగా రాకపోకలు సాగించినట్లు రైల్వే (Indian Railways) అధికారులు వెల్లడించారు. ప్రయాణికుల్లో.. ముఖ్యంగా యువతలో ఈ రైళ్లు గణనీయమైన ప్రజాదరణను పొందినట్లు తెలిపారు. ముంబయి- ఠాణెల మధ్య దేశంలోనే తొలి రైలు పరుగులు పెట్టి సోమవారానికి 171 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో రైల్వే అధికారులు ఈ మేరకు వివరాలు వెల్లడించారు.

ఐఆర్‌సీటీసీ రిఫండ్స్‌ ఇక వేగవంతం.. గంటలోనే నగదు వెనక్కి?

‘‘భారత్‌లో రైల్వేల ఇన్నేళ్ల ప్రయాణం అద్భుతంగా సాగింది. దాదాపు ప్రతీ మూలకు తన సేవలను విస్తరించింది. రైల్వేల ఆధునికీకరణకు ‘వందే భారత్‌’ సరికొత్త చిహ్నంగా నిలిచింది’’ అని అధికారులు తెలిపారు. ప్రస్తుతం సేవలందిస్తోన్న వందే భారత్‌ రైళ్లు.. 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 284 జిల్లాల మీదుగా 100 మార్గాల్లో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయని చెప్పారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈ రైళ్లు ప్రయాణించిన దూరం భూమిని 310 సార్లు చుట్టిరావడంతో సమానమన్నారు. త్వరలో పట్టాలెక్కనున్న ‘వందే భారత్ స్లీపర్ రైళ్లు’.. సుదూర ప్రయాణికులకు మంచి ప్రయాణ అనుభూతిని అందిస్తాయని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని