Flamingos: విమానం ఢీకొని.. ఫ్లెమింగోలు మృతి

ల్యాండింగ్‌కు సిద్ధంగా ఉన్న విమానాన్ని ఢీకొని 30కి పైగా ఫ్లెమింగో పక్షుల గుంపు మృతి చెందింది.

Published : 21 May 2024 19:24 IST

ముంబయి: ఓ విమానం ఢీకొనడంతో 30కి పైగా ఫ్లెమింగో పక్షులు (flamingos) మృతి చెందాయి.  ఫ్లైట్‌ ల్యాండ్‌ అయ్యే సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ముంబయిలో చోటుచేసుకొంది. పక్షులు ప్రాణాలు కోల్పోవడంపై విచారణ జరపాలంటూ పర్యావరణ కార్యకర్తలు డిమాండ్‌ చేస్తున్నారు. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..

దుబాయ్‌ నుంచి ముంబయికి వస్తున్న ఎమిరేట్స్‌ విమానం సోమవారం రాత్రి 9 గంటల సమయంలో ల్యాండ్‌ కావాల్సిఉంది. ఈ క్రమంలోనే ఆ వైపుగా ఎగురుతున్న ఫ్లెమింగో పక్షుల గుంపు విమానాన్ని ఢీకొంది. కాసేపటికి ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండ్‌ అయింది. అయితే, తీవ్రంగా గాయపడి వివిధ ప్రాంతాల్లో పడిపోయిన పక్షులను గుర్తించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఆ రాత్రి ఆయా ప్రాంతాల్లో 29కి పైగా.. మరుసటిరోజు మరికొన్ని పక్షుల కళేబరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ జాతి పక్షులు ఈ ప్రాంతంలో కనిపించడం అరుదని అధికారులు పేర్కొన్నారు.

డీప్‌ఫేక్‌ ఫొటోలను గుర్తించండిలా.. వీడియో షేర్ చేసిన కేంద్రం

ప్రమాదంపై దర్యాప్తు మొదలుపెట్టిన అధికారులు.. మరణించిన పక్షులకు పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ఫలితాలు వచ్చేందుకు నాలుగురోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలంటూ పర్యావరణ కార్యకర్తలు డిమాండ్‌ చేస్తున్నారు. విమానాశ్రయ అధికారులతో సమావేశమై ఇలాంటి పరిస్థితులు మరోసారి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు