PM Modi: పార్లమెంట్‌ ఘటన తీవ్రమైన అంశం.. రాద్ధాంతం అనవసరం: ప్రధాని మోదీ

పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం ఘటనపై  ప్రధాని మోదీ తొలిసారి స్పందించారు. ఇది చాలా తీవ్రమైన అంశమని, దీనిపై రాద్ధాంతం అనవసరమని వ్యాఖ్యానించారు.

Updated : 17 Dec 2023 18:31 IST

దిల్లీ: పార్లమెంటులో భద్రతా వైఫల్యం (Parliament Security Breach) ఘటన దురదృష్టకరమని, దానిని ఏమాత్రం తక్కువగా అంచనా వేయకూడదని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. ఈ ఘటనపై అనవసరపు రాద్ధాంతం చేయొద్దని ప్రతిపక్షాలను కోరారు. ‘దైనిక్‌ జాగరణ్‌’ వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా సమస్య లోతుల్లోకి వెళ్లి పరిష్కారం కనుగొనాలని ప్రధాని వ్యాఖ్యానించారు. 

‘‘పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం చోటు చేసుకోవడం ఎంతో బాధించింది. దీన్ని తక్కువగా అంచనా వేయకూడదు. ఇలాంటివి పునరావృతం కాకుండా మూలాల్లోకి వెళ్లి పరిష్కారం కనుగొనాలి. ప్రతిపక్షాలు దీనిపై అనవసర రాద్ధాంతం చేయడం మానుకోవాలి. ఘటన అనంతరం స్పీకర్‌ ఓం బిర్లా విచారణకు ఆదేశించారు. దర్యాప్తుపై మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ కుట్ర వెనుక నిజాలు త్వరలోనే బయటపడతాయి’’ అని ప్రధాని చెప్పినట్లు వార్తా సంస్థ కథనంలో పేర్కొంది. 

ఆత్మాహుతి చేసుకోవాలనుకున్నారు..!

మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ సీఎంలుగా కొత్త వారిని ఎంపిక చేయడంపై ప్రధాని మాట్లాడుతూ ‘‘మూడు రాష్ట్రాల సీఎంలు కొత్తవారని చాలా మంది భావిస్తున్నారు. నిజానికి, వారు కొత్తవాళ్లేం కాదు.. ఎంతో కాలం ప్రజల కోసం కష్టపడ్డారు. ఎంతో అనుభవం ఉంది. చాలా కాలంగా మీడియా దృష్టి కొన్ని కుటుంబాలపైనే ఉండిపోయింది. దీంతో కష్టపడి పనిచేసే వారి గురించి పెద్దగా ఎవరికీ తెలియలేదు. ఇలాంటివి ప్రతి రంగంలోనూ జరుగుతాయి’’ అని పేర్కొన్నారు.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని