Susmita Dev: తృణమూల్‌ ఎంపీ సుష్మితా దేవ్‌పై దాడి.. స్వల్ప గాయాలు

తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ సుష్మితా దేవ్‌పై శుక్రవారం దాడి జరిగింది. త్రిపురలో టీఎంసీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న ఆమె కారుపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు.

Published : 22 Oct 2021 20:06 IST

అగర్తల: తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ సుష్మితా దేవ్‌పై శుక్రవారం దాడి జరిగింది. త్రిపురలో టీఎంసీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న ఆమె కారుపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. కారును అడ్డగించి కర్రలతో కొట్టారు. అడ్డుకోబోయిన ఎంపీపైనా దాడి చేశారు. ఈ ఘటనలో సుష్మిత సహా పార్టీ కార్యకర్తలు స్వల్పంగా గాయపడ్డారు. దీంతో వారిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి చేర్చి చికిత్స అందించారు. అనంతరం ఆమె నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. 

ఘటనపై తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికార భాజపాపై విరుచుకుపడ్డారు. ‘‘భాజపా సీఎం బిప్లవ్‌ దేవ్‌ నాయకత్వంలో ప్రతిపక్ష రాజకీయ నేతపై దాడి జరగడం ఓ కొత్త రికార్డు! సిట్టింగ్‌ మహిళా రాజ్యసభ ఎంపీపై దాడి సిగ్గుచేటు. ఇది పూర్తిగా భాజపా గూండాల రాజకీయ ఉగ్రవాదమే. వారికి సమయం దగ్గరపడుతోంది. త్రిపుర ప్రజలు తగిన సమాధానం చెబుతారు’’ అని టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీ ట్విటర్‌ వేదికగా మండిపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోను పార్టీ తమ ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని