Parliament: ఆటంకాలు ఎదురైనా.. అభివృద్ధి ఆగలేదు: ప్రధాని మోదీ

తమ పదేళ్ల పాలనలో రిఫామ్‌, పెర్ఫామ్‌, ట్రాన్స్‌ఫామ్‌లపై దృష్టి సారించినట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు.

Updated : 10 Feb 2024 18:11 IST

దిల్లీ: గత ఐదేళ్లలో అద్భుతమైన ఫలితాలు సాధించామని, కరోనా వంటి అనేక ఆటంకాలు ఎదురైనా.. దేశంలో అభివృద్ధి మాత్రం ఆగలేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పేర్కొన్నారు. బడ్జెట్‌ సమావేశాల చివరి రోజు లోక్‌సభ (Lok Sabha)లో ప్రధాని మోదీ మాట్లాడారు. ఎన్నో తరాలు, ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నిర్ణయాలను ప్రస్తుత లోక్‌సభ కాలంలో తీసుకున్నామని చెప్పారు. ‘ఆర్టికల్ 370’ రద్దును ఈ సందర్భంగా ఉటంకించారు. సభలో ‘రామ మందిరం’పై తీర్మానం.. భవిష్యత్తు తరాలకు దేశ విలువలపై గర్వపడేలా రాజ్యాంగపరమైన స్థైర్యాన్ని ఇస్తుందన్నారు.

370 సీట్లు పక్కా.. ఎన్నికలకు ముందే సీఏఏ: అమిత్‌ షా

తమ పాలనలో రిఫామ్‌, పెర్ఫామ్‌, ట్రాన్స్‌ఫామ్‌లపై దృష్టి సారించినట్లు ప్రధాని మోదీ చెప్పారు. స్వాతంత్ర్య సాధన లక్ష్యాలను నిత్యం స్మరించుకుంటున్నామని, వాటి దిశగా తమ పాలన కొనసాగుతోందన్నారు. మరో పాతికేళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా మారతామని.. ‘వికసిత్‌ భారత్‌’ ఫలాలు మన భావితరాలకు అందుతాయని తెలిపారు. జీ20 సదస్సును విజయవంతంగా నిర్వహించామని, దీంతో విశ్వవేదికపై దేశ ప్రతిష్ఠ మరింత పెరిగిందని వివరించారు. కొత్త పార్లమెంటు భవనం మనందరికీ గర్వకారణమన్నారు. డిజిటలైజేషన్‌తో కాగితరహిత పార్లమెంటుగా తీర్చిదిద్దినట్లు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని