PM Modi: టీఎంసీ అంటే ఇదే.. కొత్త అర్థం చెప్పిన ప్రధాని

పశ్చిమబెంగాల్‌లో జరిగిన ర్యాలీలో పాల్గొన్న ప్రధాని మోదీ, దీదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

Updated : 02 Mar 2024 17:04 IST

కోల్‌కతా: త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ప్రచారాన్ని ముమ్మరం చేస్తూ ఆయా రాష్ట్రాల్లో పర్యటనలు చేస్తున్నారు. పశ్చిమబెంగాల్‌ (West Bengal)లోని నదియా జిల్లా కృష్ణానగర్‌లో జరిగిన ర్యాలీలో శనివారం ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా దీదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

‘బిజోయ్‌ సంకల్ప సభ’కు భారీ సంఖ్యలో వచ్చిన ప్రజలను చూసి మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ అభిమానాన్ని చూసి లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే 400లకు పైగా సీట్లు గెలుచుకుంటుందనే ఆత్మవిశ్వాసం మరింత బలపడుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పనితీరు చూసి బెంగాల్‌ ప్రజలు నిరాశకు గురవుతున్నారన్నారు. దౌర్జన్యాలు, రాజవంశ రాజకీయాలు, ద్రోహాలకు టీఎంసీ పర్యాయ పదమని ఆరోపించారు. ‘‘పశ్చిమ బెంగాల్‌ ప్రతిష్ఠకు టీఎంసీ భంగం కలిగిస్తోంది. కేంద్ర పథకాల ఫలాలను పేదలకు అందకుండ అడ్డుకుంటోంది. వాటిపై తమ స్టిక్కర్‌ వేసి తమదని నిరూపించే ప్రయత్నం చేస్తోంది. టీఎంసీ అంటే తూ, మైన్‌, ఔర్‌ కరప్షన్‌ (నువ్వు.. నేను.. అవినీతి)’’ అంటూ పార్టీకి కొత్త పేరు పెట్టారు. 

భాజపా తొలి జాబితాలో.. కంగనా రనౌత్, అక్షయ్‌ కుమార్‌..?

సందేశ్‌ఖాలీ అంశాన్ని ప్రధాని లేవనెత్తారు. వేధింపులకు గురైన తల్లులు, సోదరీమణులు న్యాయం కోసం పోరాడుతుండగా.. వారికి అండగా ఉండాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నిందితుల పక్షాన నిలబడుతోందని ఆరోపించారు. బాధితుల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు అరెస్టు జరగాలో నేరగాళ్లే నిర్ణయించుకునేంతగా పరిస్థితి మారిందని విమర్శించారు.

 

 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని