Modi Diwali: చైనా సరిహద్దుల్లో సైనికులతో మోదీ దీపావళి వేడుకలు

Modi Diwali: 2014 నుంచి ప్రధాని మోదీ ఏటా సైనికులతో కలిసి దీపావళి చేసుకుంటున్నారు. ఈసారి హిమాచల్‌లోని లేప్చాకు వెళ్లి భద్రతా దళాలతో వేడుకలు చేసుకున్నారు.

Published : 12 Nov 2023 12:14 IST

దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం హిమాచల్‌ ప్రదేశ్‌లోని లేప్చా (Modi in Lepcha) సైనిక శిబిరాన్ని సందర్శించారు. ఏటా నిర్వహించుకుంటున్నట్లుగానే ఈసారీ ఆయన సైనికులతో కలిసి దీపావళి (Diwali) వేడుకలు చేసుకుంటున్నారు. అక్కడికి చేరుకున్న ఫొటోలను ఆయన స్వయంగా ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. ధైర్యవంతమైన మన భద్రతా బలగాలతో కలిసి పండగ చేసుకుంటున్నట్లు తెలిపారు. మిలిటరీ దుస్తులు ధరించిన మోదీ.. సైనికులతో ముచ్చటిస్తుండడం ఫొటోల్లో గమనించొచ్చు.

2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మోదీ (Modi) ఏటా సరిహద్దుల్లో సైనికులతో కలిసి దీపావళి (Diwali) వేడుకలు చేసుకుంటున్నారు. దళాలతో ముచ్చటించి.. వారికి స్వీట్లు తినిపించి సరదాగా గడుపుతూ వారిలో స్ఫూర్తిని నింపుతున్నారు. 2014లో మోదీ తొలిసారి సియాచిన్‌లో సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. గత ఏడాది కార్గిల్‌లో వేడుకలు చేసుకున్నారు.

మరోవైపు ఈరోజు హిమాచల్‌కు వెళ్లడానికి ముందు ‘ఎక్స్‌’ వేదికగా మోదీ దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండుగ ప్రతిఒక్కరి జీవితంలోకి ఆనందాన్ని, సమృద్ధిని, మంచి ఆరోగ్యాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని