PM Modi: కర్పూరి ఠాకూర్‌ కుటుంబసభ్యులను కలిసిన ప్రధాని

‘భారత రత్న’కు ఎంపికైన బిహార్‌ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్‌ కుటుంబసభ్యులను ప్రధాని మోదీ తన నివాసానికి ఆహ్వానించారు. 

Updated : 12 Feb 2024 20:02 IST

దిల్లీ: దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారత రత్న’కు ఎంపికైన బిహార్‌ మాజీ సీఎం, దివంగత నేత కర్పూరి ఠాకూర్‌ (Karpoori Thakur) కుటుంబసభ్యులను ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) మర్యాదపూర్వకంగా కలిశారు. దిల్లీలోని ఆయన అధికారిక నివాసానికే ఠాకూర్‌ కుటుంబాన్ని ఆహ్వానించారు. ఠాకూర్‌ కుమారుడు, జేడీ(యూ) నేత రామ్‌నాథ్‌ ఠాకూర్‌ సహా కుటుంబసభ్యులతో మోదీ ముచ్చటించారు.

‘‘జన నాయకుడు కర్పూరి ఠాకూర్‌ కుటుంబాన్ని కలవడం ఎంతో సంతోషంగా ఉంది. సమాజంలోని వెనకబడిన తరగతులు, అణగారిన వర్గాలకు ఆయన అండగా నిలిచారు. ఆయన జీవితం, ఆదర్శ సూత్రాలు దేశ ప్రజలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి’’ అని మోదీ పేర్కొన్నారు. తన తండ్రిని ‘భారత రత్న’తో గౌరవించినందుకు ప్రధానికి రామ్‌నాథ్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్షణాలు తమకు మరో దీపావళి అంటూ హర్షం వ్యక్తం చేశారు.

బుల్డోజర్‌తో కూల్చడం ఫ్యాషన్‌గా మారింది : మధ్యప్రదేశ్‌ హైకోర్టు వ్యాఖ్యలు

అనునిత్యం పేద ప్రజల సంక్షేమం కోసం, సామాజిక మార్పు కోసం కృషి చేసిన కర్పూరిని.. ఇటీవల కేంద్రప్ర భుత్వం భారతరత్నతో గౌరవించింది. కొన్ని రోజుల వ్యవధిలోనే భాజపా అగ్రనేత లాల్‌కృష్ణ ఆడ్వాణీ, పీవీ నరసింహారావు, ఎంఎస్‌ స్వామినాథన్‌, చరణ్‌ సింగ్‌ చౌధరిలకు కూడా ఈ పురస్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని