PM Modi: ‘ఇలాంటి సీఎంను చూసి గర్విస్తున్నా’.. యోగిపై ప్రధాని ప్రశంసలు

ఉత్తరప్రదేశ్‌ అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై ప్రధాని ప్రశంసల జల్లు కురిపించారు. ఆయనను చూసి తానెంతో గర్విస్తున్నానని అన్నారు.

Published : 22 Apr 2024 19:59 IST

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ (Yogi Adityanath)పై ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ప్రశంసలు కురిపించారు. రాష్ట్ర అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. భాజపా నేతృత్వంలో రాష్ట్రం ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌- ఆత్మ నిర్భర్‌ సేన’కి హబ్‌గా మారుతోందన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అలీఘఢ్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొన్న మోదీ ప్రసంగించారు.

‘‘బుల్డోజర్‌ అని యోగి ఆదిత్యనాథ్‌ను పేర్కొనే వారికి ఒక్కటే చెప్పదలచుకున్నా. పరిశ్రమల కోసం యోగి ప్రభుత్వం కృషి చేసినట్లుగా స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచి ఎవరూ చేయలేదు. ఒక జిల్లా.. ఒకే ఉత్పత్తి మిషన్‌ దేశానికి గౌరవాన్ని తీసుకొస్తోంది. ఇటువంటి ముఖ్యమంత్రి నా సహచరుడిగా ఉన్నందుకు గర్వపడుతున్నా’’ అని వ్యాఖ్యానించారు.

కేజ్రీవాల్‌ ఆరోగ్యం.. మెడికల్‌ బోర్డు ఏర్పాటుకు కోర్టు ఆదేశం

భారత్‌ను అవినీతి, కుటుంబ రాజకీయాల నుంచి దూరం చేసే సమయం ఆసన్నమైందన్నారు. ఈ సమయంలో మీ ఓట్లు ఎంతో విలువైనవని, మళ్లీ భాజపాను గెలిపించాలని కోరారు. ప్రజల ఆశీర్వాదం కోసమే తాను రాష్ట్రానికి వచ్చినట్లు తెలిపారు. ఈసందర్భంగా కాంగ్రెస్‌తో పాటు సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌పైనా విమర్శలు గుప్పించారు. హస్తం పార్టీ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని