PM Modi: ‘సందేశ్‌ఖాలీ’ అభ్యర్థికి మోదీ ఫోన్‌.. ‘శక్తి స్వరూపం’ అంటూ ప్రశంస

పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ (Sandeshkhali) బాధితురాలు, బసిర్‌హట్‌ (Lok Sabha Elections) భాజపా అభ్యర్థి రేఖ పత్రాతో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు.

Published : 26 Mar 2024 19:37 IST

దిల్లీ: పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ (Sandeshkhali) బాధితురాలు రేఖ పత్రాను భాజపా లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) బరిలో నిలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమెతో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ఆమెను ‘శక్తి స్వరూపం’గా అభివర్ణించిన ప్రధాని.. ఎన్నికల సన్నాహాలతోపాటు ఆమె యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజల ఇబ్బందులు, తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతల ఆగడాల గురించి  ఆమె ప్రధానికి వివరించినట్లు సమాచారం.

కేజ్రీవాల్‌ అరెస్టుపై స్పందించిన అమెరికా

పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ (TMC)కు చెందిన షాజహాన్‌ షేక్‌, అతడి అనుచరులు.. మహిళలపై అకృత్యాలకు పాల్పడటమే గాక, వారి భూములను బలవంతంగా లాక్కొన్నట్లు ఆరోపణలు వచ్చాయి. వీరికి వ్యతిరేకంగా కొద్ది నెలల క్రితం ఇక్కడ మహిళలు చేపట్టిన ఆందోళనలకు రేఖ పత్రా నాయకత్వం వహించారు. టీఎంసీ నేతల అకృత్యాలకు ఎదురొడ్డి నిలిచిన ఆమెను లోక్‌సభ ఎన్నికల్లో తమ అభ్యర్థిగా భాజపా ప్రకటించింది. బసిర్‌హట్‌ స్థానం నుంచి అవకాశం కల్పించింది. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోనే సందేశ్‌ఖాలీ గ్రామం ఉంది. బసిర్‌హట్‌ నియోజకవర్గానికి ప్రస్తుతం తృణమూల్‌ నేత, నటి నుష్రత్‌ జహాన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఆమెను పక్కనబెట్టిన అధికారపార్టీ.. వేరే వ్యక్తికి అవకాశం కల్పించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు