Modi: క్యాబినెట్‌ బెర్త్‌లంటూ బురిడీ కొట్టిస్తారు.. జాగ్రత్త: ఎంపీలకు మోదీ సూచన

క్యాబినెట్ బెర్త్‌ల విషయంలో నకిలీ సమాచారాన్ని నమ్మొద్దని, వదంతులకు దూరంగా ఉండాలని ఎంపీలకు ప్రధాని మోదీ (Modi) సూచించారు.  

Published : 07 Jun 2024 17:49 IST

దిల్లీ: తమ కూటమి నాయకుడిగా నరేంద్ర మోదీ (Modi)ని ఏన్డీయే నేతలంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీనిపై మోదీ మాట్లాడుతూ.. తన మిత్రపక్షాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే క్యాబినెట్ బెర్త్‌ల విషయంలో బురిడీ కొట్టించేవారుంటారని జాగ్రత్త అని చెప్పారు. ఈసందర్భంగా ఆయన చెప్పిన మాటలతో కూటమి ఎంపీలంతా చిరునవ్వులు చిందించారు.

‘‘కొంతమంది మీ దగ్గరకు వచ్చి, క్యాబినెట్‌ బెర్త్ ఇప్పిస్తామని చెప్తారు. టెక్నాలజీ ఏ స్థాయిలో ఉందంటే.. నా సంతకాలతో ఉన్న జాబితా బయటకు రావొచ్చు. ఇలాంటి చర్యలతో ఎలాంటి ప్రయోజనం ఉండదు. అలాంటి కుట్రలకు చిక్కొద్దని ఎంపీలను కోరుతున్నాను. ఈ విషయంలో విపక్ష కూటమికి డబుల్ పీహెచ్‌డీ ఉంది. వారు తమ నైపుణ్యాలను ఉపయోగించే అవకాశం ఉంటుంది. వదంతులకు దూరంగా ఉండండి. సంచలనాల కోసం చేసే ఇలాంటి ప్రయత్నాలతో దేశాన్ని నడపించలేం’’ అని నవ్వుతూనే హెచ్చరిక చేశారు. నకిలీ సమాచార వ్యాప్తిని ఉద్దేశించే ఆయన ఈవిధంగా స్పందించారు.

దక్షిణాది రాష్ట్రాలు ఎన్డీయేను ఆదరించాయి: మోదీ

ఇక ఈ ప్రసంగంలో పలు అంశాలను ప్రస్తావించారు. NDA అంటే ‘న్యూ ఇండియా, డెవలప్‌డ్‌ ఇండియా, ఆస్పిరేషనల్‌ ఇండియా’ అని కొత్త అర్థం చెప్పారు. విపక్ష నేతలపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ ఇప్పటికీ తన శక్తి సామర్థ్యాలను తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదని ఎద్దేవా చేశారు. మరో పదేళ్లయినా ఆ పార్టీ 100 స్థానాల మార్క్‌ను దాటలేదు అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని