Farmers Protest: రైతుల ర్యాలీ అడ్డగింత.. హరియాణాలో ఉద్రిక్తత!

ఖనౌరీ సరిహద్దులోని రైతులకు మద్దతు తెలిపేందుకు హరియాణా నుంచి బయల్దేరిన కర్షకులను పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది.

Published : 23 Feb 2024 22:13 IST

చండీగఢ్‌: పంజాబ్‌ సరిహద్దులోని ఖనౌరీ (Khanauri)లో నిలిచిపోయిన రైతులకు మద్దతు తెలిపేందుకు హరియాణా (Haryana) నుంచి పెద్దఎత్తున బయల్దేరిన అన్నదాతలను పోలీసులు అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఖేడీ చోప్టా వద్ద కొంతమంది ఆందోళనకారులు పోలీసు సిబ్బందిపై రాళ్లు రువ్వారు. దీంతో కర్షకులను నిలువరించేందుకు పోలీసులు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. ఈ ఘటనలో పలువురు భద్రత సిబ్బందికి గాయాలయ్యాయి. కొంతమంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. (Farmers Protest)

‘నేను మలాలాను కాదు’: కశ్మీరీ యువతి ప్రసంగం వైరల్‌

రైతన్నలపై లాఠీఛార్జీ చేసి, జల ఫిరంగుల్ని ప్రయోగించారని భారతీయ కిసాన్ యూనియన్ (BKU) హిస్సార్ యూనిట్ అధ్యక్షుడు గోలు ఆరోపించారు. పోలీసుల చర్యకు నిరసనగా నిరసన దీక్ష చేపడుతున్నట్లు వెల్లడించారు. దీంతో ఈ ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణకు భారీగా బలగాలను మోహరించారు. పంటల మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం సహా పలు డిమాండ్లతో రైతులు ‘దిల్లీ చలో’ ఆందోళనను తలపెట్టిన విషయం తెలిసిందే. పోలీసులు అడ్డుకోవడంతో వేలాది మంది ఖనౌరీ, శంభు సరిహద్దుల్లో ఉండిపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని