Tattoo: టాటూ పార్లర్‌ల ఎదుట పోలీసుల క్యూ.. ఎందుకంటే?

పచ్చబొట్లు వేయించుకున్న పోలీసులు వెంటనే వాటిని సమూలంగా తొలగించుకోవాలంటూ ఒడిశా స్పెషల్‌ సెక్యూరిటీ బెటాలియన్‌ ఆదేశాలు జారీ చేసింది.

Published : 12 Apr 2024 00:10 IST

భువనేశ్వర్‌: పచ్చబొట్లు వేయించుకున్న పోలీసులు వెంటనే వాటిని తొలగించుకోవాలని ఒడిశా (Odisha) స్పెషల్‌ సెక్యూరిటీ బెటాలియన్‌ (SSB) ఆదేశించింది. అందుకు తక్కువ గడువు పెట్టడంతో టాటూ పార్లర్‌ల వద్ద పోలీసులు క్యూ కట్టారు. ఉన్నఫళంగా పచ్చబొట్లను తొలగించాలని ఆదేశించడానికి గల కారణాలను డీఎస్పీ సుధాకర్‌ మిశ్రా వివరించారు.

‘‘రాష్ట్రంలో చాలామంది పోలీసులు యూనిఫాం వెలుపల పచ్చబొట్లు వేయించుకున్నారు. సిబ్బంది టాటూ వేయించుకోవడం పరిశీలకుల దృష్టిలో చెడు అభిప్రాయం ఏర్పరిచే అవకాశం ఉంది. ఇది జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధుల ఎదుట ఒడిశా పోలీసు వ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేలా చేస్తుంది. అందుకే ఈ ఆదేశాలు జారీ చేశాం. టాటూలను తొలగించుకునేందుకు 15 నుంచి 20 రోజుల గడువు విధించాం’’ అని వెల్లడించారు.

గేమర్లతో మోదీ ‘ఆన్‌లైన్‌ గేమ్‌’.. వైరల్‌ వీడియో చూశారా..?

రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది కనీసం 1,000 మంది ఉంటారు. ఎస్‌ఎస్‌బీ ఆదేశాల మేరకు పోలీసులు టాటూ పార్లర్‌లకు క్యూ కట్టారు. పచ్చబొట్టు వేయించుకునే ప్రక్రియ కంటే.. వాటిని తొలగించేందుకు ఎక్కువ సమయం పడుతుంది. వీటిని సమూలంగా తొలగించాలంటే లేజర్‌ చికిత్స అవసరం. 20 రోజుల వ్యవధిలో నాలుగు సెషన్లలో వీటిని తొలగిస్తారు. ఇందుకు అయ్యే ఖర్చు కూడా ఎక్కువే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు