Chandrayaan-3: చంద్రుడిపై నడయాడిన భారత్‌: ఇస్రో ట్వీట్‌

Chandrayaan-3: భారత్‌ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 ల్యాండర్‌ విక్రమ్‌ జాబిల్లిపై అడుగిడింది. అందులోని రోవర్ విజయవంతంగా బయటకు వచ్చి, తన అధ్యయనాన్ని ప్రారంభించింది. 

Published : 24 Aug 2023 09:52 IST

బెంగళూరు: జాబిల్లి యాత్రల్లో ఇప్పటిదాకా ఏ దేశమూ అందుకోలేకపోయిన సంక్లిష్ట లక్ష్యాన్ని ఇస్రో విజయవంతంగా ఛేదించి చరిత్ర సృష్టించింది. చందమామ దక్షిణ ధ్రువం వద్ద విక్రమ్‌ ల్యాండ్ అయిన దాదాపు నాలుగు గంటల తర్వాత దాని లోపలి నుంచి ప్రగ్యాన్‌ రోవర్ సాఫీగా బయటకు వచ్చింది. దీనిపై భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం (ISRO) స్పందించింది. 

‘చంద్రయాన్‌-3(Chandrayaan-3) రోవర్‌ చంద్రుడి కోసం భారత్‌లో తయారైంది. అది ల్యాండర్‌ నుంచి సాఫీగా బయటకు వచ్చింది. దాంతో భారత్‌ చంద్రుడిపై నడిచింది’ అని అర్థం వచ్చేలా ఇస్రో ట్వీట్ చేసింది. ఇక ల్యాండర్‌లో పంపించిన రోవర్‌ పేరు ప్రగ్యాన్‌. దీని బరువు 26 కిలోలు. ఆరు చక్రాల సాయంతో చంద్రుడి ఉపరితలంపై తిరుగుతూ 14 రోజులు పనిచేస్తుంది. ఇందులో రెండు పేలోడ్‌లు ఉన్నాయి. ప్రస్తుతం రోవర్‌ తన అధ్యయనం మొదలుపెట్టింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని