Bharat Ratna: పీవీకి భారతరత్న ప్రదానం.. స్వీకరించిన కుమారుడు

Bharat Ratna: మాజీ ప్రధాని పీవీ నరసింహారావును కేంద్ర ప్రభుత్వం భారతరత్నతో సత్కరించిన సంగతి తెలిసిందే. ఆ అవార్డును నేడు కుటుంబసభ్యులు స్వీకరించారు.

Updated : 30 Mar 2024 14:59 IST

దిల్లీ: దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న (Bharat Ratna)’ ప్రదానోత్సవం శనివారం నిర్వహించారు. దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రథమ మహిళ ద్రౌపదీ ముర్ము (President Droupadi Murmu) వీటిని ప్రదానం చేశారు. దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు (PV Narasimha Rao) తరఫున ఆయన కుమారుడు ప్రభాకర్‌రావు ఈ పురస్కారాన్ని స్వీకరించారు. కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రులు అమిత్‌ షా, జైశంకర్‌, కిషన్‌ రెడ్డి, భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే తదితరులు హాజరయ్యారు.

పలు రంగాల్లో దేశానికి సేవలందించిన ఐదుగురు ప్రముఖులకు ఈ ఏడాది మూడు విడతల్లో ‘భారతరత్న’ ప్రకటించిన సంగతి తెలిసిందే. బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకుర్‌, భాజపా అగ్రనేత ఎల్‌.కె.ఆడ్వాణీ, మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చౌదరీ చరణ్‌సింగ్‌, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌ను ఈ అత్యున్నత పురస్కారంతో గౌరవించారు.

ఇందులో నలుగురికి మరణానంతరం ఈ అవార్డు లభించగా.. నేడు వారి కుటుంబసభ్యులకు పురస్కారాన్ని ప్రదానం చేశారు. కర్పూరీ ఠాకుర్‌ తరఫున ఆయన కుమారుడు రామ్‌నాథ్‌, చౌదరీ చరణ్‌ సింగ్‌ తరఫున ఆయన మనవుడు జయంత్‌ సింగ్‌, స్వామినాథన్‌ తరఫున అవార్డును కుమార్తె నిత్యా రావు స్వీకరించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఆడ్వాణీ ఇంటికెళ్లి ‘భారతరత్న’ ప్రదానం చేయనున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని