ఎయిమ్స్‌కు రాష్ట్రపతి కోవింద్‌

దేశ ప్రథమ పౌరుడు, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఛాతీలో అసౌకర్యం కారణంగా ఆయన నిన్న దిల్లీలోని ఆర్మీ రీసెర్చ్‌ అంఫ్‌ రెఫరల్‌

Published : 27 Mar 2021 13:25 IST

దిల్లీ: దేశ ప్రథమ పౌరుడు, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఛాతీలో అసౌకర్యం కారణంగా ఆయన నిన్న దిల్లీలోని ఆర్మీ రీసెర్చ్‌ అండ్‌‌ రెఫరల్‌ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. వైద్యులు ఆయనకు సాధారణ వైద్యపరీక్షలు నిర్వహించి అబ్జర్వేషన్‌లో ఉంచారు. రాష్ట్రపతి ఆరోగ్యంపై శనివారం ఉదయం ఆర్మీ ఆసుపత్రి బులిటెన్‌ విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పిన ఆసుపత్రి వర్గాలు.. తదుపరి వైద్య పరీక్షల నిమిత్తం రాష్ట్రపతిని ఎయిమ్స్‌కు పంపించనున్నట్లు తెలిపాయి.

రాష్ట్రపతి ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిన వెంటనే బంగ్లాదేశ్‌ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. కోవింద్‌ కుమారుడితో ఫోన్లో మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆర్మీ ఆసుపత్రికి వెళ్లి రాష్ట్రపతిని పరామర్శించారు. తను క్షేమంగా ఉండాలని ప్రార్థించిన వారికి కోవింద్‌ ట్విటర్‌ వేదికగా కృతజ్ఞతలు తెలియజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని