Porsche crash: పుణె కారు ఘటన.. నిందితుడి రక్త నమూనాలు మార్చిన వైద్యులపై వేటు!

పుణెలో రోడ్డు ప్రమాదం కేసులో నిందితుడి రక్త నమూనాలు మార్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైద్యులపై వేటు పడింది.

Published : 29 May 2024 21:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పుణెలో రోడ్డు ప్రమాదం కేసులో నిందితుడి రక్త నమూనాలు మార్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైద్యుడిపై వేటు పడింది. డాక్టర్‌ శ్రీహరి హల్నోర్‌ను సాసూన్‌ జనరల్‌ ఆస్పత్రి నుంచి తొలగించారు. అతడిని సర్వీసు నుంచి పూర్తిగా డిస్మిస్‌ చేసినట్లు డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యూకేషన్‌ అండ్‌ రీసెర్చి ఆఫ్‌ మహారాష్ట్ర ప్రకటించింది. దీంతోపాటు ఈ కేసులో ఉన్న ఫోరెన్సిక్‌ విభాగం అధిపతి డాక్టర్‌ తావ్‌డేపైనా సస్పెన్షన్‌ వేటు వేసింది. ఇప్పటికే వైద్యులు శ్రీహరి హల్నోర్‌, తావ్‌డేతోపాటు ఒక గుమస్తాను కూడా పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

ప్రమాదం జరిగిన రోజు డాక్టర్‌ తావ్‌డే, నిందితుడి తండ్రి ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా నిందితుడి రక్త నమూనాలను మార్చేస్తే భారీ మొత్తం ఇచ్చేలా డీల్‌ కుదిరింది. ఈ నేపథ్యంలోనే తావ్‌డే తన ప్లాన్‌ను వివరించాడు. నిందితుడైన బాలుడి రక్త నమూనాలకు బదులు వేరే డాక్టర్‌ నమూనాలను ఆ స్థానంలో పెడతామని వెల్లడించాడు. వైద్య పరీక్షల్లో ఆల్కహాల్‌ ఆనవాళ్లు బయటపడ కూడదనే ఇలా చేశారు. ఈ వ్యవహారంలో డబ్బులు తీసుకొచ్చిన గుమస్తా విచారణ సందర్భంగా ఒక దశలో ఆవేశంతో.. ‘నన్ను ఇరికించారు కదా.. ఎవరినీ వదలను.. అందరినీ లాగుతా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు