viral video: రోడ్లపై వర్షం నీరు.. యువకుడి ఫీట్లతో బేజారు

పుణెలో భారీగా కురిసిన వర్షాలకు రోడ్లన్నీ నీటి కుంటలను తలపిస్తుండడంతో ఓ యువకుడు నీటిలో పడుకొని జారుతూ ఎంజాయ్‌ చేస్తున్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.   

Published : 08 Jun 2024 19:00 IST

పుణె: పుణె(Pune)లో శుక్రవారం కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీనివల్ల వాహనదారులు ఇబ్బందిపడుతుంటే కొందరు యువకులు మాత్రం వర్షాన్ని ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ సమయంలో ఓ యువకుడు చేసిన పని నెట్టింట్లో వైరల్‌గా మారింది. అదేంటంటే..

పుణెలోని రహదారులు నీటితో నిండిపోయి చెరువులను తలపిస్తుండడంతో ఓ యువకుడు రోడ్డుపై పారుతున్న నీటిలో మ్యాట్రస్‌పై పడుకొని నీటిలో జారుతూ ఎంజాయ్‌ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.  దీనిపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. ఓ నెటిజన్‌ స్పందిస్తూ ‘మంచి ఐడియా బ్రో.. నీ స్వాగే వేరు’ అంటూ కామెంట్‌ చేశారు. ‘పర్యావరణానికి అనుకూలంగా ఖర్చు లేని ప్రయాణం’ అంటూ మరో నెటిజన్‌ స్పందించారు. 

మహారాష్ట్రలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో  భారీ వర్షాలు కురిశాయి. దక్షిణ కొంకణ్‌లోని సింధుదుర్గ్ జిల్లా, పశ్చిమ మహారాష్ట్రలోని సాంగ్లీ, కొల్హాపూర్‌లకు రుతుపవనాలు చేరుకున్నాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) శాస్త్రవేత్త సునీల్ కాంబ్లే తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని