Rahul Gandhi: నాన్నకు ఇష్టమైన జిలేబీలు.. ప్రియాంక చేసిన కేకులు..! రాహుల్‌ మధుర జ్ఞాపకాలు

రాయ్‌బరేలీ నుంచి పోటీకి దిగిన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆ ప్రాంతంతో తనకున్న అనుబంధాన్ని, చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. 

Updated : 18 May 2024 15:19 IST

దిల్లీ: కాంగ్రెస్‌కు కంచుకోటగా పేరొందిన రాయ్‌బరేలీ నుంచి ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) పోటీకి సిద్ధమయ్యారు. ఆ ప్రాంతంతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. రాహుల్‌కు సంబంధించిన వీడియోను హస్తం పార్టీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ ‘ఎక్స్’ (ట్విటర్‌)లో షేర్‌ చేశారు.

‘‘దేశం సాధించిన పురోగతిలో రాయ్‌బరేలీది కీలక పాత్ర. స్వాతంత్ర్య పోరాటంలో దేశానికి మార్గనిర్దేశం చేసింది ఈ ప్రాంతమే. గతంలో రాష్ట్ర రాజకీయాలకు కేంద్రంగా ఉండేది. దేశానికి మరోసారి పురోగతి, అభివృద్ధి పథాన్ని చూపాల్సిన సమయం ఆసన్నమైంది’’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తన కుటుంబాన్ని ఎలా గౌరవిస్తానో.. అదేవిధంగా దేశ కుటుంబసభ్యులతో సత్సంబంధాలు కొనసాగిస్తానని రాహుల్‌ హామీ ఇచ్చారు.

మాలీవాల్‌ను బయటకు పంపిన భద్రతా సిబ్బంది.. కేజ్రీవాల్‌ నివాసం నుంచి మరో వీడియో

అక్కడ ఎన్నో అందమైన జ్ఞాపకాలు..

‘‘రాయ్‌బరేలీ వెళ్లినప్పుడల్లా నేను, ప్రియాంక మా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటాం. నాన్నమ్మ జ్ఞాపకాలు, నాన్నకు ఇష్టమైన జిలేబీలు, ప్రియాంక చేసిన కేకులు, ఇలా ఎన్నో మధురమైన క్షణాలు కళ్ల ముందు కనిపిస్తుంటాయి. ఇవన్నీ నిన్నే జరిగినట్లుగా అనిపిస్తోంది. చిన్నప్పటినుంచి రాజకీయాలతో అనుబంధం ఉంది. కానీ, మా మధ్య రాజకీయాలకు ఎప్పుడూ చోటివ్వలేదు’’ అని బాల్యాన్ని గుర్తు చేసుకున్న రాహుల్‌ భావోద్వేగానికి గురయ్యారు. మీరు రాజకీయాలు చేస్తున్నప్పుడు మీ కుటుంబాలకు గౌరవం ఇవ్వలేకపోతే.. బయట కూడా సత్సంబంధాలు కొనసాగించలేరని అని భాజపా అగ్రనేతలపై విరుచుకుపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని