Rahul gandhi: చిరిగిన బూట్లు వేసుకున్నా.. వాళ్లంతా సంపన్న నేతలే: రాహుల్‌

కొందరు నాయకులు తాము సాధారణ జీవితం గడుపుతునట్లు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. ఆ నాయకులు తమ పిల్లల విషయంలో దీన్ని అమలు చేయలేరన్నారు.

Published : 29 Nov 2023 17:13 IST

తిరువనంతపురం: కొందరు రాజకీయ నాయకుల సాధారణ వస్త్రధారణ చూసి వారిపై ఒక అంచనాకు రాకూదని.. దానికి వెనుక వారి మరో నిజస్వరూపం ఉంటుందని కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul gandhi)అన్నారు. కేరళలోని కొయ్‌కోడ్‌లో ఓ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో బుధవారం రాహుల్‌ పాల్గొన్నారు. సాధారణ జీవితం గడుపుతున్నట్లుగా కనిపించే కొందరి నాయకులను ఉద్దేశించి ఈ సందర్భంగా మాట్లాడారు.

ఒక నాయకుడు వినయపూర్వకంగా లేకపోతే.. తనని తాను ఆత్మపరిశీలన చేసుకోకపోతే అతడు ఒక నాయకుడే కాదని రాహుల్‌ గాంధీ అన్నారు. అయితే, కొందరు రాజకీయ నాయకులు తాము సాధారణ జీవితం గడుపుతున్నామని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తుంటారని అన్నారు.

చైనాలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల కలకలం.. భారత్‌లో 6 రాష్ట్రాలు అలర్ట్‌..!

‘‘నా 18 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎంతో మంది నాయకులను కలిశాను. కొందరు నాయకులు ఖరీదైన దుస్తువులు, చేతి గడియారాలు ధరించకుండా తాము చాలా సాధారణమైన జీవితం గడుపుతున్నామని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తుంటారు. ఒకసారి వాళ్ల ఇంటికి వెళ్లి.. వారి పిల్లల్ని చూస్తే ఆ నాయకుల నిజస్వరూపం తెలుస్తుంది. వాళ్ల ఇళ్ల వద్ద ఖరీదైన కార్లు ఉంటాయి. ప్రజల దగ్గర వారి అసలు రూపాన్ని దాచగలరు కానీ.. ఇది వారి పిల్లల విషయంలో సాధ్య పడదు’’ అని రాహుల్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు