Indian Railways: భారతీయ రైల్వేలో సెకండ్‌ క్లాస్‌, ఆర్డినరీ ఛార్జీల పునరుద్ధరణ

భారతీయ రైల్వే ( Indian Railway ) శాఖ ప్రయాణికులకు ఊరటనిచ్చింది. కొన్ని రకాల రైళ్లలో పాత ప్రయాణ ఛార్జీలను పునరుద్ధరించింది. 

Updated : 27 Feb 2024 14:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రైలు ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. ఎక్స్‌ప్రెస్‌ స్పెషల్‌గా మార్చిన ప్యాసింజర్‌ రైళ్లలోని సెకండ్‌క్లాస్‌ ఆర్డినరీ ఛార్జీలను ఫిబ్రవరి 27 నుంచి పునరుద్ధరించింది. కొవిడ్‌ లాక్‌డౌన్‌ తర్వాత రైల్వే మెల్లగా ప్యాసింజర్‌ ట్రైన్ల పేర్లను మార్చడం మొదలుపెట్టింది. వాటి కొత్త పేర్ల ఆధారంగా ఛార్జీలు వసూలుచేస్తుండటంతో ఆర్డినరీ ఛార్జీలు పూర్తిగా అదృశ్యమయ్యాయి. దీంతో కనీస టికెట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు సమానంగా ధర రూ.10 నుంచి రూ.30కు చేరడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సోమవారం రైల్వే బోర్డు రివ్వ్యూ మీటింగ్‌ నిర్వహించి కీలక నిర్ణయం తీసుకొంది.  

భారత్‌-బ్రిటన్‌ సముద్రగర్భ కమ్యూనికేషన్‌ కేబుల్‌పై హూతీల దాడి..!

తాజాగా సెకండ్‌ క్లాస్‌ ఆర్డినరీ రైళ్ల కనీస టికెట్‌ ధరను పాత రేట్లులానే వసూలుచేయాలని ది చీఫ్‌ బుకింగ్‌ రిజర్వేషన్‌ అధికారులకు మంగళవారం తెల్లవారుజామున సమాచారం అందింది. మెయిన్‌లైన్‌ ఎలక్ట్రిక్‌ మల్టిపుల్‌ యూనిట్‌ (ఎంఈఎంయూ)లో ఆర్డినరీ క్లాస్‌ టికెట్‌ ధరలు 50శాతం వరకు తగ్గాయి. సాధారణంగా ఈ రైలు నంబర్లు సున్నాతో మొదలవుతుంటాయి. అన్‌ రిజర్వుడ్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌లోను వీటి ధరలు అప్‌డేట్‌ చేశారు. గతంలో ప్యాసింజర్‌ రైళ్లుగా సేవలందించి ఆ తర్వాత ఎక్స్‌ప్రెస్‌ స్పెషల్స్‌గా మారిన అన్నింటికీ ఈ మార్పు వర్తిస్తుంది. 

జూన్‌ 2022లో నైరుతీ రైల్వే మొత్తం 8 ప్యాసింజర్‌ స్పెషల్స్‌ను అన్‌ రిజర్వ్‌డు ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చింది. 2021 ఏప్రిల్‌లో ఇదే మొత్తం 20 రైళ్లను ఎక్స్‌ప్రెస్‌లుగా చేర్చింది. 200 కిలోమీటర్ల దూరానికి మించి ప్యాసింజర్‌ రైళ్లను నడపకూడదని నిర్ణయించింది. 2020లో మొత్తం 502 ప్యాసింజర్‌ రైళ్లను మార్చాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని